Shahid Afridi record knock in NatWest T20 Blast నాట్ వెస్టులో దుమ్మురేపిన షాహిద్ అఫ్రీదీ

Shahid afridi finally breaks jinx with record knock in natwest t20 blast

Shahid Afridi, NatWest T20 Blast, NatWest T20 Blast 2017, Hampshire County Cricket Club, Derbyshire County Cricket Club, cricket news, cricket, sports news, latest news

Shahid Afridi broke a long-standing jinx in Twenty20 cricket as he blasted a record breaking century to guide Hampshire to victory over Derbyshire in the ongoing NatWest T20 Blast.

నాట్ వెస్టులో దుమ్మురేపిన షాహిద్ అఫ్రీదీ

Posted: 08/23/2017 06:54 PM IST
Shahid afridi finally breaks jinx with record knock in natwest t20 blast

ఇంటర్నేషనల్ క్రికెట్‌ వీడ్కోలు పలికిన తర్వాత పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్ షాహిద్‌ ఆఫ్రిది తన బ్యాటును జుళిపించాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన అఫ్రీది టి20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. తనదైన శైలిలో విజృభించి సెంచరీ బాదాడు. నాట్ వెస్ట్‌ టి20 బ్లాస్ట్ టోర్నమెంటులో భాగంగా డెర్బీషైర్ జట్టుతో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచులో ఆఫ్రిది చెలరేగాడు. హంప్ షైర్ తరపున ఓపెనర్ గా బరిలోకి దిగిన అఫ్రీదీ 43 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకాన్ని నమోదు చేశాడు.

ఆఫ్రిది సంచలన బ్యాటింగ్ తో హంప్ షైర్ 101 పరుగుల భారీ తేడాతో డెర్బ షైర్ జట్టును చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హంప్ షైర్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన డెర్బ్ షైర్ 19.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ తరుణంలో అభిమానులకు పాత అఫ్రిదీని గుర్తుకు తెచ్చిన  మాజీ కెప్టెన్.. 1996లో ప్రపంచ చాంపియన్స్‌ శ్రీలంకతో జరిగిన వన్డేలో 37 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించిన రికార్డును గుర్తుతెచ్చుకన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles