Rajasthan Royals approach BCCI for change in name పేరు మార్చుకుంటే ప్రక్షాళన జరిగిపోతుందా.?

Rajasthan royals approach bcci for change in name

rajasthan royals, kings xi punjab, ipl spot-fixing case, kxip mohali, bcci, rajasthan cricket association, ipl, cricket news, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Rajasthan Royals (RR) are set to make a comeback in IPL after a two-year suspension, the team management wants to make a change in name of its parent company ahead of the new season.

పేరు మార్చుకుంటే ప్రక్షాళన జరిగిపోతుందా.?

Posted: 08/22/2017 03:41 PM IST
Rajasthan royals approach bcci for change in name

2008లో ఐపిఎల్ ఛాంపియన్స్ గా అవతరించిన రాజస్థాన్ రాయల్స్.. ఫ్రాంచైజీ సహ యజమాని రాజ్‌కుంద్రా బెట్టింగ్‌ కార్యకలాపాల కారణంగా రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొని మళ్లీ బరిలోకి దిగనుంది. అయితే కొత్తగా మళ్లీ బరిలోకి దిగుతున్న రాయల్స్‌ పేరును మార్చుకునేందుకు సిద్దమైంది. రెండేళ్ల సస్పెన్షన్‌ తర్వాత ఐపీఎల్‌-2018లో రీఎంట్రీ ఇవ్వనున్న రాయల్స్‌ పేరు మార్చుకుని రావాలని భావిస్తుంది. క్లీన్‌ ఇమేజ్‌తో పునరాగమనం చేయాలని భావిస్తున్న రాయల్స్‌ .. ఫ్రాంచైజీ పేరు మార్పు కోసం బీసీసీఐని సంప్రదించింది. టీమ్‌ మొత్తాన్ని ప్రక్షాళన చేసి.. జట్టు ప్రతిష్ఠను పెంచే వారిని నియమించుకునేందుకు రాయల్స్‌ కార్యాచరణ ఆరంభించిందని సమాచారం.

అంతేకాకుండా సొంతగడ్డ జైపూర్ నుంచి తరలిపోవడానికి కూడా ఫ్రాంచైజీ ప్రయత్నాలు చేస్తున్నదని తెలిసింది. ఐపీఎల్ ఆరంభ టైటిల్ ను సొంతం చేసుకున్న రాయల్స్‌ ఆ తరువాత అంతటి ప్రదర్శన ఇవ్వలేదు. ఐపీఎల్ మరో జట్టు కింగ్స్ లెవెన్ పంజాబ్ కూడా మొహాలీ నుంచి తరలిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నదనే వార్తలు వస్తున్నాయి. పంజాబ్ రాష్ట్ర సంఘం నుంచి తగిన సహకారం లేదని, స్థానిక సంస్థల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కారణంతో మరో చోటికి మార్చాలని బీసీసీఐని కోరిందని తెలిసింది. గతంలో కూడా కింగ్స్ లెవెన్ ఇలాంటి ప్రతిపాదనే చేసినా.. బోర్డు తోసిపుచ్చింది. ఒకవేళ బేస్ ను మార్చుకుంటే కొత్త వేదిక ప్రకారం టీమ్ పేరు కూడా మారే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajasthan royals  kings xi punjab  ipl spot-fixing case  kxip mohali  bcci  cricket  

Other Articles