2018 under-19 World Cup schedule announced ఐసీసీ వరల్డ్ కప్ కు సన్నధమవుతున్న టీమిండియా

India to open u 19 world cup campaign against australia

cricket, icc under 19 world cup, india cricket team, australia cricket team, india_cricket_team, australia_cricket_team, icc_u-19_world_cup, cricket, sports news, latest news

India is going to open against Australia in the ICC Under-19 World Cup, scheduled to be held from January 13 to February 3, next year.

వరల్డ్ కప్ షెడ్యూల్ ను ప్రకటించిన ఐసీసీ

Posted: 08/17/2017 07:58 PM IST
India to open u 19 world cup campaign against australia

క్రికెట్ అన్న పదం వింటేనే భారతీయుల్లో ఒక నిత్యనూతన పులకింత ఏర్పడుతుంది. ఇక అందులో తమ దేశం ప్రాతినిథ్యం వహిస్తుందని అంటే.. ఖచ్చితంగా ఆటను చూసేందుకు తమ పనులను కూడా వాయిదా వేసుకుంటారు. ఇటీవల జరిగిన మహిళ ప్రపంచకప్ క్రికెట్ ను వీక్షించిన వారిలో భారత్ తరువాత స్థానం దక్షిణాప్రికాదేనన్న విషయం ఐసీసీ వెల్లడించింది. దీన్ని బట్టి భారత్ లో క్రికెట్ అంటే ఎంత మక్కువ వుందో ఇట్టే అందరికీ అర్థమవుతుంది. ఇప్పడీ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే.. ఇదివరకే భారత్ మూడు పర్యాయాలు ముద్దాడిన ప్రపంచ కప్ త్వరలోనే మనముందుకు రానుంది.

కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనిల సారథ్యంలో రెండు పర్యాయాలేగా టీమిండియా ప్రపంచ కప్ సాధించిందని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారా..? మేం చెప్పేది.. అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీ గురించి.  2000 సంవత్సరంలో మహ్మద్‌ కైఫ్‌ నాయకత్వంలో భారత్‌ తొలిసారి అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచింది. ఆ తర్వాత 2008లో విరాట్‌ కోహ్లీ, 2012లో ఉన్ముక్త్‌ చంద్‌ నేతృత్వంలో ట్రోఫీని ముద్దాడింది. ఇక నాలుగో పర్యాయం కూడా ప్రపంచ కప్ ను అందుకునేందుకు టీమిండియా అండర్ 19 టీమ్ సన్నాహానికి సిద్దం అవుతుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజా ప్రపంచ కప్ సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించిన నేపథ్యంలో మన అండర్ 19 జట్టు కూడా సన్నధమవుతుంది.

న్యూజిలాండ్‌ వేదికగా 2018 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రతినిధులు వెల్లడించారు. టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఉన్న జట్లు ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయని, ఆ తదుపరి స్థానాల్లో ఉన్న జట్ల మధ్య అర్హత మ్యాచ్‌లు జరగనున్నాయని ఐసీసీ తెలిపింది. భారత జట్టు గ్రూప్‌-బిలో చోటు దక్కించుకుంది. టోర్నీలో తొలి మ్యాచ్‌ డిపెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌-న్యూజిలాండ్‌ మధ్య జరగనుంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles