Virat Kohli not upto sachin and dravid league ఆ దిగ్గజాలతో కోహ్లీకి పోలికా..? పాక్ క్రికెటర్

Virat kohli not upto sachin and dravid league says mohammed yousuf

Mohammad Yousuf, virat kohli, Rahul dravid, Sachin tendulkar, Team India, Palistan, India Cricket Team, cricket news, cricket, sports news, latest news

Former Pakistan batsman Mohammad Yousuf has praised Virat Kohli for his quality but believes that he isn’t at par with Sachin Tendulkar and Rahul Dravid.

ఆ దిగ్గజాలతో కోహ్లీకి పోలికా..? పాక్ క్రికెటర్

Posted: 08/03/2017 03:42 PM IST
Virat kohli not upto sachin and dravid league says mohammed yousuf

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రపంచం యావత్తు ప్రశంసల జల్లు కురిపిస్తున్న క్రమంలో.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలను చేశాడు. భారత దిగ్గజ క్రికెటర్లైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లతో కోహ్లీని పొల్చడం సరికాదని అన్నాడు. సచిన్, ద్రావిడ్ లు క్రికెట్ ప్రపంచంలోనే దిగ్గజాలని.. వారు నూటికి నూరు శాతం ఫర్ఫెక్షనిస్లులని కొనియాడారు. అయితే కోహ్లీ క్లాస్  బ్యాట్స్ మెన్ అని అంగీకరించాడు యూసుప్.

అయితే ఎవరు క్రికెట్ లోరాణిస్తే వారిని దిగ్గజాలతో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు. సచిన్, ద్రవిడ్ లు తమ సమయంలో క్లిష్టమైన బౌలర్లను ఎదుర్కొని దిగ్గజ ఆటగాళ్లుగా గుర్తింపు పొందారని.. ఈ నేపథ్యంలో కోహ్లిని వారితో పోల్చకూడదని యూసఫ్ అన్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ తో పోల్చదగిన స్థాయి కూడా విరాట్ కోహ్లీ ఇప్పటికీ అర్జించలేదని చెప్పాడు. ప్రస్తుత క్రికెట్ లో నాణ్యత కొరవడిందని.. మరీ ముఖ్యంగా నాణ్యమైన బౌలర్లే ప్రస్తుతం కనిపించడం లేదని అన్నారు.

తాను క్రికెట్ ఆడిన సమయంలో బౌలింగ్ లో క్వాలిటీ ఉండేదన్నాడు. బ్యాట్స్ మెన్లు ఎంతటి దిగ్గజాలైనా.. బౌలర్లు కూడా అదే స్థాయిలో దిగ్గజాలుగా ఎదిగారని అన్నాడు. అయితే తాజా పరిస్థితులలో బౌలింగ్ దిగ్గజాలు కనిపించడం లేదని పేర్కోన్నాడు. ఈ సందర్భంగా మెక్ గ్రాత్, షేన్ వార్న్ లతో పాటు, భారత్ లో అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ లను యూసఫ్ గుర్తు చేసుకున్నాడు. వారు అద్భుతమైన బౌలర్లని కొనియాడాడు. మరొకవైపు ప్రస్తుత పిచ్ లన్నీ ఫ్రెండ్లీ పిచ్ లని.. అవి బ్యాటింగ్ కు ఎక్కువగా అనుకూలిస్తాయన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles