Virat Kohli confirms KL Rahul return రెండో టెస్టులోనూ అదే దూకుడా..? రాహుల్ ఫిట్..?

Virat kohli confirms kl rahul return abhinav mukund faces india axe

Cheteshwar Pujara, India vs Sri Lanka, KL Rahul, second test, Cheteshwar Pujara 50th Test, sports news, cricket, news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Virat Kohli has confirmed that fit-again opening batsman KL Rahul will return to the side for the second test against Sri Lanka

రెండో టెస్టులోనూ అదే దూకుడా..? రాహుల్ ఫిట్..?

Posted: 08/02/2017 09:43 PM IST
Virat kohli confirms kl rahul return abhinav mukund faces india axe

మరికోన్ని గంటల వ్యవధిలో అతిథ్య జట్టు శ్రీలంకతో టీమిండియా రెండో టెస్టులో తలపడనుంది. కొలంబో వేదికగా జరగనున్న రెండో టెస్టులోనూ విరాట్ సేన అదే దూకుడును ప్రదర్శిస్తుందా..? లేదా అన్నది కూడా మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. తొలి టెస్టు మాదిరిగానే రెండు టెస్టును కూడా కైవసం చేసుకుని లంక అశలపై నీళ్లు చల్లాలని.. సాథ్యమైతే మూడు టెస్టులను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా యోచనలో భాగంగా కనబడుతుంది. టీమిండియా కోచ్ రవిశాస్త్రీ కూడా అదే వ్యూహాన్ని కోహ్లీ సేనతో చర్చించినట్లు సమాచారం.

అయితే తీవ్ర జ్వరం కారణంగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టుకు దూరమైన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ కొలంబో వేదికగా గురువారం నుంచి ఆరంభయ్యే రెండో టెస్టుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు రాహుల్ రెండో టెస్టులో ఆడబోతున్న విషయాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. రేపు ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్ తుది జట్టులో రాహుల్ కచ్చితంగా ఆడతాడని కోహ్లి పేర్కొన్నాడు. తమ సభ్యులు ప్రాక్టీస్ అనంతరం రాహుల్ ఆడే విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలిపాడు. రాహుల్ ను భద్రత కల్పించాల్సిన అవసరం జట్టుపై వుందని అయన పేర్కొన్నాడు.

'రాహుల్ మాకు కీలక ఓపెనర్. అతనితో కలిసి శిఖర్ ధావన్, అభినవ్ ముకుంద్ ల్లో ఒకరు జత కడతారు. గత రెండేళ్లలో రాహుల్ చాలా మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. కొన్ని సీజన్ ల నుంచి రాహుల్ ప్రదర్శనలో నిలకడ పెరిగింది. ప్రస్తుత భారత టెస్టు జట్టులో రాహుల్ కీలక ఓపెనర్. లంకేయులతో జరిగే రెండో టెస్టులో  రాహుల్ ఆడతాడు'అని కోహ్లి తెలిపాడు. ఇదిలా ఉంచితే, రాహుల్ తో కలిసి ధావన్-ముకుంద్ లలో ఎవరు జత కడతారు అనే దానిపై కోహ్లి పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే, ముకుంద్ కు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయనే సంకేతాలిచ్చాడు కోహ్లి. తొలి టెస్టులో ధావన్ భారీ సెంచరీతో రాణించిన నేపథ్యంలో అతని స్థానం దాదాపు ఖాయంగానే కనబడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  KL Rahul  second test  Cheteshwar Pujara 50th Test  sports news  cricket  

Other Articles