India race to 600 before Sri Lanka run out of luck శ్రీలంకను వెంటాడుతున్న ఫాలో-అన్ గండం..

Ind vs sl hardik pandya pacers put india in command on day 2

india vs sri lanka, galle test, hardik pandya, virat kohli, shikhar dhawan, cheteswar pujara, maiden test match, half century, Team India, cricket news, cricket, sports news, latest news

At stumps on the second day, Sri Lanka were struggling at 154 for 5 after Hardik Pandya's 49-ball-50 helped the visitors reach a mammoth first innings score of 600.

శ్రీలంకను వెంటాడుతున్న ఫాలో-అన్ గండం..

Posted: 07/27/2017 09:36 PM IST
Ind vs sl hardik pandya pacers put india in command on day 2

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా గాలె వేదికగా శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచులో అతిథ్య జట్టుకు ఫాలోఅన్ గండం వెన్నాడుతుంది. టీమిండియా అటగాళ్ల అద్భుత అటతీరుతో రెండోరోజు కూడా కొనసాగింది. భారత అటగాళ్లు అటు బ్యాటింగ్ లో రాణించగా, చివరకు టెయిల్ ఎండర్లు కూడా రాణించి జట్టుకు భారీ స్కోరును నమోదు చేయడంలో దోహదం చేశారు. అదే సమయంలో అటు శ్రీలంకపై టీమిండియా బౌలర్లు కూడా పట్టుబిగిస్తున్నారు. ఫలితంగా ఆటముగిసే సమయానికి శ్రీలంక 44 ఓవర్లకు 5వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.

తొలి ఇన్నింగ్స్ లో లంక టాపార్డర్ కుప్పకూలింది. ఓ దశలో 68 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లంక, ఓపెనర్ ఉపల్ తరంగ హాఫ్ సెంచరీ ( 64) తో ఆదుకోవడంతో కాస్త కోలుకుంది. అయితే లేని పరుగుకోసం ప్రయత్నించిన తరంగ జట్టు స్కోరు 125 పరుగుల దగ్గర ఔటయ్యాడు. దీంతో లంక కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఏంజెలో మాథ్యూస్ ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ జాగ్రత్తగా ఆడాడు. రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి లంక 44 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. మాథ్యూస్ 54, పెరారా 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

అంతకుముందు 399/3 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్.. లంచ్ సమయానికే మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు తొలి సెషన్ ఆరంభమైన కాసేపటికే చటేశ్వర పుజరా(153;265 బంతుల్లో 13 ఫోర్లు) నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు.ఆపై మరో ఓవర్ నైట్ ఆటగాడు రహానే(57;130 బంతుల్లో 3 ఫోర్లు) అవుట్ కావడంతో భారత్ 435 పరుగుల వద్ద ఐదో వికెట్ ను నష్టపోయింది. అటు తరువాత అశ్విన్(47; 60 బంతుల్లో 7 ఫోర్లు) మెరిశాడు. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో వికెట్ తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs sri lanka  galle test  hardik pandya  virat kohli  momahmed shami  Team India  cricket  

Other Articles