Mithali Raj closes in on ICC ODI rankings top spot టాప్ 2 ర్యాంకుకు ఎగబాకిన మిథాలీ రాజ్

Indian skipper mithali raj closes in on icc odi rankings top spot

ICC Women's World Cup 2017, ICC ODI Rankings, Mithali Raj, Meg Lanning, ICC Womens World Cup, Punam Raut, Smriti Mandhana, Jhulan Goswami, Ekta Bisht, cricket news, sports news, sports, cricket

India took a giant stride towards clinching a semi-final spot with another convincing 16-run victory over Sri Lanka in a one-sided ICC Women's World Cup encounter

టాప్ 2 ర్యాంకుకు ఎగబాకిన మిథాలీ రాజ్

Posted: 07/17/2017 06:31 PM IST
Indian skipper mithali raj closes in on icc odi rankings top spot

టీమిండియా మహిళల జట్టు సారధి మిథాలీ రాజ్.. టాప్ బ్యాట్స్ వుమెన్ జాబితాలో ఎగబాకింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకుల జాబితాలో టాప్ స్థానాన్ని అక్రమించేందుకు పోటీ పడింది. అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ మెగ్‌ లాన్నింగ్‌ తో పోటీ పడిన మిథాలీ.. కేవలం ఐదు పాయింట్ల తేడాతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 779 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న లాన్నింగ్ కు మిథాలీ చేరువలోనే ఉంది. ఇద్దరి మధ్య కేవలం 5పాయింట్ల తేడా మాత్రమే ఉంది. మిథాలీ తప్ప టాప్‌-10లో ఏ ఒక్క భారత క్రికెటర్‌కి చోటు దక్కలేదు.

ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానం సంపాదించడంతో పాటు మిథాలి మరో అరుదైన ఘనత సాధించారు. మహిళల వరల్డ్ కప్ లో వెయ్యి పరుగులు మార్కు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా అమె నూతన రికార్డును నమోదు చేశారు. ఇంగ్లాండ్‌, వేల్స్‌లో జరుగుతోన్న మహిళల వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో వరుస విజయాలతో జట్టును సెమీస్‌ చేర్చారు. అత్యంత కీలకమైన మ్యాచ్ లో అమె కెప్టెన్ ఇన్నింగ్స్ అడి 109 పరుగులను సాధించి భారత్ జట్టుకు సెమీస్ బెర్తును ఖారారు చేశారు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో మిథాలీ 356 పరుగులు సాధించింది. ఇక బౌలింగ్ విభాగంలో జులన్ గోస్వామి, ఎక్తా బిస్త్ తమ ర్యాంకులను దిగజార్చుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా, వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, భారత్‌, వెస్టిండీస్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles