Murali Vijay looking to make comeback in the Sri Lanka series శ్రీలంక టూర్ కు సిద్దమంటున్న మురళీ విజయ్

Murali vijay india opener confident of being fit in time for sri lanka series

champions trophy 2017, ICC Champions Trophy 2017, england, australia, bangladesh, new zealand, icc group a teams, cricket news, cricket, sports news, latest news

Indian Test opener Murali Vijay has said that he was targeting the Sri Lanka series that follows the short limited-overs tour to West Indies, to make a comeback into the national setup.

శ్రీలంక టూర్ కు సిద్దమంటున్న మురళీ విజయ్

Posted: 06/16/2017 09:28 PM IST
Murali vijay india opener confident of being fit in time for sri lanka series

టీమిండియా టెస్టు ఓపెనర్ మురళీ విజయ్ శ్రీలంకతో టూర్ పై దృష్టి సారించాడు. శ్రీలంకతో టూర్ నాటికి తాను టీమిండియా జట్టులో స్థానాన్ని తిరిగి సంపాదిస్తానని నమ్మకంతో వున్నాడు. గత రెండు నెలల క్రితం మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్న మురళీ విజయ్ కోలుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ ట్రైనర్ రజనీకాంత్ పర్యవేక్షణలో ఫిట్నెస్ ను మెరుగుపరుచుకుంటున్నట్లు విజయ్ తెలిపాడు. వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ కు సంబంధించి భారత జట్టులో స్థానం సంపాదించడంపైనే తన దృష్టిని కేంద్రీకరించినట్లు పేర్కొన్నాడు.

'గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నాను. మరొకొద్ది రోజుల్లో ఫిట్గా తయారవుతా. ఎన్సీఏ ట్రైనర్ రజనీ కాంత్ నా ఫిట్ నెస్ ను పర్యవేక్షిస్తున్నారు. నా ఫిట్నెస్ మెరుగుదలకు రజనీకాంత్ సరైన వ్యక్తి అనుకుంటున్నా. అత్యుత్తమ ట్రైనర్ అయిన అతనితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. త్వరలో ఫిట్టర్ క్రికెటర్ గా తయారవుతా' అని మురళీ విజయ్ తెలిపాడు. గత ఏప్రిల్ నెలలో అతని మణికట్టుకు ఇంగ్లండ్ లో ఆపరేషన్ చేయించుకున్న విజయ్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఆపై చెన్నైలో ట్రైనర్ రజనీకాంత్ సమక్షంలో ఫిట్ నెస్ కు మెరుగుపరుచుకునే పనిలో పడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : murali vijay  Team India  Indian Cricket  srilanka series  bcci  cricket  

Other Articles