Pakistan thrashing of rivals India to win maiden Champions

Unstoppable pakistan crush india by 180 runs

Pakistan, Pakistan Revenge India, Pak India Won, Pak India ICC Champions Trophy, ICC Champions Trophy 2017, ICC Champions Trophy Final, ICC Champions Trophy 2017 Final, India Lost Reasons, Team India Bowling, Kohli Team ICC Champions trophy, Indian Cricket Fans Angry Champions Trophy Lost

Pakistan beat India by 180 runs to win ICC Champions Trophy 2017 final.India were chasing a total of 339 and were dismissed for just 158.

భారత్ భారీ ఓటమి.. అసలేం జరిగింది?

Posted: 06/19/2017 09:22 AM IST
Unstoppable pakistan crush india by 180 runs

ఫైనల్ లో పాకిస్థాన్ సత్తా చాటింది. ఢిపెండింగ్ ఛాంపియన్ భారత్ ను మట్టి కరిపించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇంగ్లాండులోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో 180 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది. నిర్ణీత ఓవర్ల కంటే ముందే.. 30.3 ఓవర్లలోనే భారత ఆటగాళ్లందరూ ఔటయ్యారు. టీమిండియా స్టార్ ఆటగాళ్లలో ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. ఘన చరితగల మన బ్యాట్స్ మెన్ ఒకరిని చూసి మరొకరు చేతులెత్తేశారు. ఏ దశలోనూ కూడా మన టాపార్డర్ బ్యాట్స్ మేన్ పోరాటపటిమ చూపించలేకపోయారు.

నిలకడ లేమితో సతమతమైన పాక్ ఆటగాళ్లు మాత్రం అటు బ్యాటింగులోను, ఇటు బౌలింగులోను కూడా సమష్టిగా రాణించారు. కాగా, నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసిన పాక్.. టీమిండియాకు భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతిగా బరిలోకి దిగిన భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. అందరూ ఔటైపోతున్న తరుణంలో.. అంత ఒత్తిడిలోనూ నిలబడి ఆర్దిక్ పాండ్యా 76 పరుగులు చేయడం మాత్రం ఒక విశేషమనే చెప్పాలి. ఎట్టకేలకు పాక్ తమ దేశానికి చిరస్మరణీయమైన విజయాన్ని అందించటమే కాదు, 2007 టీ20 వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది.


రోహిత్ శర్మ (0), ధావన్ (21), విరాట్ కోహ్లీ (5), యువరాజ్ సింగ్ (22), ధోనీ (4), జాదవ్ (9), పాండ్యా(76), జడేజా (15), అశ్విన్ (1), బుమ్రా (2), భువనేశ్వర్ ఒక్క పరుగు చేసి నాటౌట్ గా నిలిచాడు.

పాక్ బౌలింగ్:
మహ్మద్ అమీర్ - 3, హసన్ అలీ - 3, షాదాబ్ ఖాన్ - 2, జునైద్ ఖాన్-1


ఓటమికి కారణాలు విశ్లేషిస్తే.. స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న భారత్ ఫీల్డింగ్ పెద్ద తప్పుచేసిందని భావిస్తున్నారు. మరోవైపు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ పాక్ మైండ్ గేమ్ ఆడింది. స్కోర్ బోర్డు పరుగులు పెట్టించి పాక్ బ్యాట్స్ మెన్స్ , కీలక వికెట్లు తీసి బౌలర్లు దాని మరింత ఎక్కువ చేసేశారు. 9 పరుగుల వద్ద ఫకర్ జమాన్ వికెట్ ను బుమ్రా నిర్లక్ష్యం మూలంగా భారీ జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ తర్వాత కోహ్లీ కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించటం గమనించదగ్గ విషయం.

అన్నింటికి మించి వచ్చిన విమర్శలన్నింటిని తట్టుకుని పాకిస్థాన్ బాగా రాణించింది. ఓడిపోయి ఉంటే తమ దేశంలో వాళ్ల పరిస్థితి ఏంటో వాళ్లకి అర్థమైంది. అందుకే కసిగా ఆడి కప్పును ఎగరేసుకుపోయారు. ప్రతిగా అవమానకరమైన రీతిలో ఓటమికి టీవీలు బద్ధలు అవ్వటం, ఆటగాళ్లపై అభిమానుల ఆగ్రహజ్వాలలు మన దేశంలో కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Champions Trophy  2017  India  Pakistan  

Other Articles