Sarfraz happy to 'prove critics wrong' after historic win ఆ ఓటమితోనే పాఠాలు.. ఫైనల్ లోకి అడుగులు

Pakistan skipper sarfraz ahmed proud of young guns show vs england

champions trophy, Champions Trophy 2017, India vs Pakistan, India Pakistan Cricket Match, Team India, Pakistan, Pakistan sponsered Terrorism, Pakistan terror camps in Kashmir, Sarfaraz Ahmed, England, cricket news, sports news, spots, cricket

Pakistan cricket team thrashed England cricket team by eight wickets with 12.5 overs to spare at Sophia Gardens on Wednesday to reach the final of the ICC Champions Trophy for the first time.

ఆ ఓటమితోనే పాఠాలు.. ఫైనల్ లోకి అడుగులు

Posted: 06/15/2017 07:31 PM IST
Pakistan skipper sarfraz ahmed proud of young guns show vs england

ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ బి జాబితాలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర ఓటమే తమలో గెలవాలన్న కాంక్షను, కసిని పెంచిందని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అన్నారు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఓడిన తరువాత ప్రత్యర్థి జట్ట అంచనాలకు అందని రీతిలో ఏకంగా ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన పాకిస్తాన్.. భారత్ తో ఓటమే తమను విజయాల దిశగా నడిపించిందని అన్నారు. సెమీఫైనల్‌లో బలమైన ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ని మట్టికరిపించి మరీ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్పరాజ్ మీడియాతో పలు విషయాలను పంచుకున్నాడు.

లీగ్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓడిపోవడం నుంచే తాముపాఠాలు నేర్చుకున్నామన్నారు. భారత్‌తో ఓటమి అనంతరం తమకు మద్దతుగా నిలిచిన సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు. సెమీఫైనల్లో విజయం బౌలర్ల వల్లే దక్కిందని.. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని చెప్పారు.అమిర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన రయీస్ తమ నమ్మాకన్ని నిలబెట్టాడని అన్నాడు. ఇండియాతో ఓటమి తర్వాత సెమీస్‌ చేరాలంటే ఆడే ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి నెలకోన్న నేపథ్యంలో తమ జట్టు సభ్యులతో తాను ఒక్కటే చెప్పానని అన్నాడు.

ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా అడాలని చెప్పానని, అయితే అందుకు టీమ్ మేనేజ్ మెంట్ కూడా పూర్తిగా సహకరించి తమ జట్టు సభ్యులపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని అన్నాడు. అందువల్లే తాము ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ కు చేరుకోగలిగామని సర్ఫరాజ్‌ తెలిపాడు. అనంతరం భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ గురించి స్పందిస్తూ.. ఇరు జట్లు అద్భుతంగా ఆడతాయి. ఫైనల్లో ఎవర్ని ఎదుర్కోవడానికైనా తాము సిద్ధంగా ఉన్నాంమని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  ICC  pakistan  Team India  safraaz  cricket  

Other Articles