Rashid Latif apology to sehwag and India టీమిండియా క్రికెటర్ల ప్రతిభను శ్లాఘించిన పాకిస్థాని క్రికెటర్

Rashid latif takes u turn calls virender sehwag a great player

Indian Cricket, Pakistan Cricket, Rashid Latif, Virender Sehwag, Virat Kohli, bcci, india cricket coach, icc champions trophy, ICC Champions Trophy 2017, cricket news, sports news, Team India, cricket

Former Pakistan captain heaped praise on the Indian batting icon’s career. Backing the Indian team to reach the final of the Champions Trophy,

టీమిండియా క్రికెటర్ల ప్రతిభను శ్లాఘించిన పాకిస్థాని క్రికెటర్

Posted: 06/14/2017 09:49 PM IST
Rashid latif takes u turn calls virender sehwag a great player

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌-పాకిస్థాన్‌ తలపడాలని కోరుకుంటున్నట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి రషీద్‌ లతీఫ్‌ తెలిపాడు. గతంలో సెహ్వాగ్‌పై చేసిన వ్యాఖ్యలను లతీఫ్‌ వెనక్కి తీసుకున్నాడు. అంతేకాదు సెహ్వాగ్‌, కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. సెహ్వాగ్‌ గ్రేట్‌ ప్లేయర్‌ అని, కోహ్లీ ప్రపంచంలోనే బెస్ట్‌ ప్లేయర్‌ అని కితాబిచ్చాడు. సెహ్వాగ్‌ రెండు త్రిశతకాలు సాధించాడు అతనెంత గొప్ప ఆటగాడో అందరికీ తెలుసని అన్నాడు.

ఐసీసీ వన్డే ఈవెంట్లో ఉప ఖండానికి చెందిన మూడు దేశాలు సెమీఫైనల్‌ చేరడం చాలా అరుదుగా జరుగుతోందని తాజాగా ఆయన సోషల్ మీడియా ద్వారా మరో వీడియోలో పేర్కోన్నాడు. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కే ఎక్కువ మంది అభిమానులు ఉంటారని అందుకనే ఈ రెండు జట్టు ఫైనల్ లో తలపడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌. కుంబ్లే నిజాయతీ గల వ్యక్తని తన  కెరీర్‌లో కుంబ్లేని ఎదుర్కొన్నానని చెప్పాడు.

ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. టోర్నీలో భాగంగా లీగ్‌ దశలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అనంతరం సెహ్వాగ్‌ చేసిన ఓ సరదా ట్వీట్‌పై లతీఫ్‌ స్పందిస్తూ.. 15నిమిషాల నిడివి ఉన్న వీడియో పెట్టాడు. అందులో భారత్‌ను తీవ్రంగా దూషించాడు. దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సెహ్వాగ్‌ స్పందిస్తూ.. ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యల కంటే అర్థవంతమైన మౌనమే మంచిదంటూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles