Virat Kohli bags Rs 100 crore deal with MRF విరాట్ కోహ్లీ మరో డీల్ కుదిరిందహో..

Virat kohli bags another 100 crore sponsorship deal

champions trophy, Champions Trophy 2017, India vs Pakistan, India Bangladesh Cricket Match, virat kohli, mrf, rs 100 cr deal, sachin tendulkar, England, cricket news, sports news, spots, cricket

India's captain and arguably the biggest ever brand since Sachin, Virat Kohli has reportedly just signed an eight-year Rs 100 crore deal to have MRF on his bat

విరాట్ కోహ్లీ మరో డీల్ కుదిరిందహో..

Posted: 06/14/2017 08:14 PM IST
Virat kohli bags another 100 crore sponsorship deal

తన అద్బుత బ్యాటింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల యావత్ భారత దేశం నుంచి ఒక అంశంలో ఒకే ఒక్కడుగా నిలిచాడు. ప్రముఖ సంస్థ ఫోర్భ్ ప్రపంచంలో అత్యంత సంపన్నమైన క్రీడాకారుల జాబితాను ప్రచురించడంతో అందులో మన దేశం నుంచి విరాట్ స్థానం సంపాదించాడు. ఇక తాజాగా తన ఖాతాలో మరో రూ.100 కోట్ల డీల్‌ చేరింది. ఎంఆర్ఎఫ్ సంస్థ 8 ఏళ్ల కాలానికి రూ.100 కోట్లకు అతడితో ఒప్పందాన్ని పునరుద్ధరించినట్లు సమాచారం. అంతకు ముందు విరాట్ పూమా సంస్థతో 8 ఏళ్ల కాలనికే రూ.100 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకొన్న సంగతి తెలిసిందే.

గతంలో క్రికెట్ దిగ్గజాలు బ్రయన్ లారా, సచిన్‌ తెందుల్కర్ కు స్పాన్సర్ చేసిన ఎంఆర్ఎఫ్ తో ప్రస్తుతం శిఖర్ ధావన్‌, ఏబీ డివిలియర్స్ తోనూ ఒప్పందాలున్నాయి. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న టాప్‌-100 క్రీడాకారుల జాబితాలో కోహ్లీ 89వ స్థానంలో ఉన్నాడు. ఐతే కూల్ డ్రింక్స్ ఉత్పత్తి సంస్థ పెప్సీకో భారీ మొత్తం చెల్లించి ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తున్నా విరాట్ మాత్రం ససేమిరా అంటున్నాడు. తాను సేవించని వాటి గురించి ప్రచారం చేయలేనని చెబుతున్నాడు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  virat kohli  mrf  rs 100 cr deal  Team India  sachin tendulkar  cricket  

Other Articles