Kohli credits Sri Lanka for seizing the moment విజయం మా నుంచి వారి చేతుల్లోకి జారిపోయింది

Kohli credits sri lanka for seizing the moment

champions trophy, Champions Trophy 2017, Mendis, Gunathilaka anchor highest Champions Trophy chase to keep SL alive, Virat Kohli, India v Sri Lanka at The Oval, ICC Champions Trophy, India cricket, Sri Lanka cricket, England, cricket news, sports news, spots, cricket

Virat Kohli has lauded Sri Lanka's gutsy batting performance and said that his team was not "invincible" despite setting up a big target of 322, which he personally thought was enough to win their Champions Trophy match.

విజయం మా నుంచి వారి చేతుల్లోకి జారిపోయింది

Posted: 06/09/2017 11:58 AM IST
Kohli credits sri lanka for seizing the moment

డిఫెండింగ్ చాంపియన్ గా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలోకి అడుగుపెట్టిన టీమిండియా.. దాయాది పాకిస్తాన్ పై విజయం సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఇక నిన్నటి మ్యాచ్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 322 పరుగుల విజయలక్ష్యాన్ని వారికి నిర్ధేశించడంతో గెలుపుపై ధీమా వచ్చేసి.. తామే గెలుస్తామన్న అంచానాల్లోకి చేరుకుని.. అందివచ్చిన అవకాశాలను జారవిడుచుకుని.. లంకేయుల భాగస్వామ్యాలను విడదీయడంలో విఫలమైంది. దీనికి తోడు అన్ ఫీల్డ్ లో కూడా అతంగా రాణించలేకపోవడంతో చేజేతులా మ్యాచ్ ను జారవిడుచుకున్నారు.

దీంతో విరాట్ సేనకు టీమిండియాకు శ్రీలంక చేతిలో తొలి పరాభవం ఎదురైంది. ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సేనపై లంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. లంకేయులను తేలికగా తీసుకుని విరాట్ సేన భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ దారుణ పరాజయంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. లంకేయుల ముందు తాము పెట్టిన విజయలక్ష్యం సాధారణమైనది కాదని.. దీంతో తాము గెలుస్తామన్న ధీమా పూర్తిగా వుండిందని అన్నారు. అయితే బౌలర్లను ఎంతగానో నమ్మానని, వారు మ్యాచ్ ను గెలిపిస్తారని కూడా భావించానని అన్నాడు.

విజయం తమ వైపు నుంచి జారి శ్రీలంక చేతుల్లోకి జారిపోయిందని, అయితే అసాధారణ లక్ష్యాన్ని కూడా అలవోకగా చేధించిన లంకేయులను ఆయన ప్రశంసించాడు. శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. వారి టైమింగ్ తో పాటు షాట్ సెలక్షన్ కూడా బాగుందని కితాబిచ్చాడు. పాక్‌పై రాణించిన బౌలర్లు లంకతో మాత్రం పూర్తిగా తేలిపోయారని విస్మయం వ్యక్తం చేశాడు. లంకేయులు బ్యాట్స్ మెన్లు చక్కని ప్రదర్శన చేయడమే ఇందుకు కారణమని భావిస్తున్నట్లు విరాట్ కోహ్లీ చెప్పాడు

మరీ ముఖ్యంగా తొలి వికెట్ కోల్పయిన తరువాత క్రీజులో వున్న.. కుషాల్ మెండిస్, ధనుష్క గుణతిలకలు తమ నుంచి మా నుంచి మ్యాచ్ ను దూరం చేశారని అభిప్రాయపడ్డాడు. మూడొందలకు పైచిలుకు స్కోరును కాపాడుకుంటామని భావించినా నిరాశే ఎదురైందని అవేదన వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ఆలోచనకు మరింత పదును పెడితే ఈ పరిస్థితి తలెత్తేది కాదని అన్నాడు. భారత్ తమ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై నెగ్గితేనే సెమీస్ చేరుతుంది. గ్రూప్ బి లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో.. ఇంకో మ్యాచ్ నెగ్గిన రెండు జట్లు సెమీస్ చేరతాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  ICC  Team India  Sri lanka  virat kohli  cricket  

Other Articles