Sri Lanka beat India by seven wickets in ICC Champions Trophy

Ndia suffer first loss as sri lanka complete stunning run chase

Sri Lanka Team, Team India Lost, India Lost ICC Champions Trophy, ICC Champions Trophy 2017, India ICC Champions Trophy, ICC Champions Trophy Sri Lanka vs India, ICC Champions Trophy Group B Matches, ICC Champions Trophy India Semis, Team India Lost Sri Lanka, Lanka Beat India, South Africa Vs India, Dhawan Ton Waste

Sri Lanka stun India, keep ICC Champions Trophy semis hopes alive.Underdogs Sri Lanka surprise sloppy India with 321 Runs Chage.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓడింది

Posted: 06/09/2017 08:36 AM IST
Ndia suffer first loss as sri lanka complete stunning run chase

చాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీంగా, పైగా పాక్ పై గ్రాండ్ విక్టరీతో జోరు మీదున్న టీమిండియాకు సడన్ బ్రేక్ పడింది. భారీ స్కోర్ సాధించినప్పటికీ ఛేజింగ్ చేసి మరీ శ్రీలంక షాకిచ్చింది. గురువారం కెన్నింగ్టన్‌లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. 93 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 89 పరుగులు చేసిన కుశాల్ మెండిస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

గుణతిలక 76, మ్యాథ్యూస్ 52 కుశాల్ పెరీర, గుణరత్నె 34 పరుగులు చేసి మరో 8 బంతులు మిగలి ఉండగానే శ్రీలంకను విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌కు మాత్రమే ఒక వికెట్ దక్కగా, మిగతా రెండు రనౌట్లు కావడం గమనార్హం. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్‌లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ధవన్ (128 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 125 పరుగులు) సెంచరీతో రెచ్చిపోయాడు.

ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ (79 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78 పరుగులు) మరోమారు సత్తా చాటాడు. చివర్లో ధోని 52 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. చివర్లో కేదార్ జాదవ్ 13బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25 పరుగులు పిండుకోవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లు లసిత్ మలింగ‌కు రెండు, లక్మల్, ప్రదీప్, పెరీరా, గుణరత్నేలకు ఒక్కో వికెట్ దక్కింది. ఇక సెమీస్ కు చేరాలంటే గ్రూప్ బీ లో ఆదివారం సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్ లో భారత్ ఖచ్ఛితంగా గెలిసి తీరాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Champions Trophy  India  Sri Lanka  

Other Articles