Woakes side strain gives England a worry ఛాంపియన్స్ ట్రోఫీ అతిథ్య జట్టుకు ఎదురుదెబ్బ

Chris woakes to miss rest of champions trophy

england,bangladesh,joseph edward root,christopher roger woakes,icc champions trophy 2017,cricket, sports

England Cricket on Friday confirmed that Chris Woakes suffered a side strain against Bangladesh and will miss the rest of the ICC Champions Trophy 2017.

ఛాంపియన్స్ ట్రోఫీ అతిథ్య జట్టుకు ఎదురుదెబ్బ

Posted: 06/02/2017 08:45 PM IST
Chris woakes to miss rest of champions trophy

చాంపియన్స్ ట్రోఫీకి అదిథ్యమిస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు తొలి రోజున శుభారంభం పలుకరించగా, అంతలోనే ఎదురుదెబ్బ కూడా తగిలింది. తొలి రోజు జరిగిన మ్యాచ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసిన ఇంగ్లండ్ ను అప్పుడే గాయాల బెడద వేధిస్తోంది. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో పక్కటెముకలు పట్టేయడంతో వోక్స్ టోర్నీ నుంచి దూరమయ్యాడు. అతనికి సుదీర్ఘ విశ్రాంతి అవసరమైన నేపథ్యంలో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది.

మరొకవైపు నిన్నటి మ్యాచ్ లో సెంచరీతో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించిన జో రూట్ కు కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఇయాన్ మోర్గాన్ తో కలిసి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంతో అతని కండరాలు పట్టేశాయి. దాంతో అతను తదుపరి మ్యాచ్ లో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. జో రూట్ ఫిట్ నెస్ నిరూపించుకుంటేనే న్యూజిలాండ్ తో మ్యాచ్ లో అతను పాల్గొంటాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chris Woakes  england  champions trophy 2017  injury  side strain  cricket  

Other Articles