Ramachandra Guha Backs Coach Kumble కుంబ్లేకు వెనకేసుకోస్తూ బాంబు పేల్చిన రామచంద్ర గుహ

Ramachandra guha tears into dhoni in resignation letter

anil kumble, bcci, BCCI Committee of Administrators, MS Dhoni, Ramachandra Guha, Vinod Rai, virat kohli, superstar culture, cricket

Historian Ramachandra Guha in a strongly worded letter to chairman Vinod Rai, pulled up the BCCI for handing MS Dhoni a Grade ‘A’ contractm but backed kumble.

కుంబ్లేకు వెనకేసుకోస్తూ బాంబు పేల్చిన రామచంద్ర గుహ

Posted: 06/02/2017 08:00 PM IST
Ramachandra guha tears into dhoni in resignation letter

ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ. భారత క్రికెట్ ప్రధాన కచ్ అనీల్ కుంబ్లేను వెనకేసుకువచ్చారు. వ్యక్తిగత కారణాల నుంచి తాను బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నుండి బయటకు వస్తూన్నట్లు ప్రకటించి.. వస్తునే బాంబు పేల్చారు. చైర్మన్ వినోద్ రాయ్ కి  ఏడు కీలక అంశాలతో లేఖాస్త్రాన్ని సంధిస్తూ క్రికెట్ లో సూపర్ స్టార్ కల్చర్ ను ప్రోత్సహించడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు. భారత్‌ క్రికెట్‌, బీసీసీఐలో కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. టెస్టుల నుంచి రిటైర్డ్ అయిన ఎంఎస్‌ ధోనికి గ్రేడ్‌-ఏ కాంట్రాక్టు కొనసాగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

2014లో టెస్టు క్రికెట్ నుండి తనంత తానుగా తప్పుకున్న ధోనికి టాప్ గ్రేడ్‌ కొనసాగించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే క్రికెట్ ఏజెన్సీలతో సంబంధమున్న గవాస్కర్ ను వ్యాఖ్యాతగా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఇక కొంత మంది జాతీయ కోచ్ లకు బీసీసీఐ అధిక ప్రాధాన్యం ఇచ్చిందని, జాతీయ జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించకుండా కోచ్లు రెండు నెలల పాటు ఐపీఎల్‌ మత్తులో మునిగితేలారని ధ్వజమెత్తారు. ఇక టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేకు ఆయన మద్దతు పలికారు. కుంబ్లే సత్తా ఏమిటో అతడి రికార్డులే చెబుతాయని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramachandra Guha  CoA  BCCI  superstar culture  MS Dhoni  Anil kumble  cricket  

Other Articles