Suresh Raina fan rushes onto the field for autograph రైనా కోసం వలయాలను చేధించిన అభిమాని

Suresh raina fan rushes onto the field for autograph

india,suresh kumar raina,gujarat lions,delhi daredevils,sachin ramesh tendulkar,mahendra singh dhoni,green park kanpur,indian premier league 2017,cricket, sports, cricket

Before the security officials could react, the young fan, wearing the jersey with Raina's name on the back, ran to his star and fell to his knees and offered a white sheet of paper and pen for Raina's autograph.

రైనా కోసం వలయాలను చేధించిన అభిమాని

Posted: 05/11/2017 08:01 PM IST
Suresh raina fan rushes onto the field for autograph

భారతదేశంలో క్రికెట్ కు అభిమానులు ఎంతలా వున్నారంటే.. ఆ స్థాయిలో మరే అంశమూ పోటీపడలేనంతగా వున్నారు. క్రికెట్ కు మాత్రమే కాదు క్రికెటర్లకు కూడా అభిమానులు అదేస్థాయిలో వున్నారు. మరోలా చెప్పాలంటే క్రికెటర్లను అభిమానులు ఆరాధిస్తారు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ను క్రికెట్ దేవుడిగా చేసిన అభిమానులు.. ఆయను ఆరాధస్తున్న సంఘటనలు అనేకం. తాజాగా జరిగిన ఓ పరిణామం భారత్ లో క్రికెటర్లపై ఎంత అభిమానం వుంటుందో రుజువు చేస్తుంది.

మైదానంలో ఆడుతుండగానే భద్రతా సిబ్బందిని దాటుకొని తమ అభిమాన ఆటగాడిని కలిసేందుకూ వెనకాడరు. మైదానంలో క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌, గంగూలీ కాళ్లకు అభిమానులు దండం పెట్టిన సంఘటనలు గతంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదిలో బుధవారం కాన్పూర్‌ వేదికగా గుజరాత్‌ లయన్స్‌, దిల్లీ డేర్‌డెవిల్స్‌ మ్యాచ్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది.

స్థానిక ఆటగాడు, గుజరాత్‌ సారథి రైనాను కలిసేందుకు రింకూ అనే అభిమాని భద్రతా వలయాన్ని దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు. సిబ్బంది వచ్చేలోపే రైనాతో కరచాలనం చేశాడు. ఆటోగ్రాఫ్‌ అడిగాడు. ఆ తర్వాత రైనా కోరిక మేరకు వెంటనే మైదానం వీడాడు. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. రిషబ్‌పంత్‌ ఔటయ్యేలా అద్భుత ఫీల్డింగ్‌ చేసిన రైనాను అభినందించేందుకు తాను మైదానంలోకి వెళ్లినట్లు రింకూ చెప్పాడు. గతంలో ఓ రంజీ మ్యాచ్‌ సందర్భంలో తన అభిమాన క్రికెటర్‌ను కలిశానని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suresh raina  kanpur  gujarat lions  ipl-2017  cricket  

Other Articles