Nobody knows everything about me: Sachin Tendulkar నా తొలి, పెద్ద అభిమానికే అన్నీ తెలుసు: సచిన్

Sachin tendulkar s first and biggest fan started sachin sachin chant

Sachin Tendulkar, AR Rahman, Sachin: A Billion Dreams, Sachin Sachin, Sachin movie, Sachin movie music, Sachin Tendulkar anthem, Indian cricket team, sports news, sports, cricket news, cricket

Despite loads of information on Sachin Tendulkar available, there is still so much about the Indian cricket icon that is still unknown.

నా తొలి, పెద్ద అభిమానికే అన్నీ తెలుసు: సచిన్

Posted: 05/10/2017 04:36 PM IST
Sachin tendulkar s first and biggest fan started sachin sachin chant

తన గురించి అన్నీ విషయాలు తెలసిన అభిమాని ఒక్కరు మాత్రమే ఉన్నారని, ఆ అభిమానే తన తొలి, పెద్ద అభిమానని  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. అయితే ఆ అభిమానిలా అన్ని తెలిసిన అభిమానులు మాత్రం ఎవరూ లేరని చెప్పారు. అయితే అభిమానులు తన గురించి ఎన్నో విషయాలు తెలుసునని భావిస్తుంటారని, కానీ వారికి ఎన్నో తెలియని అంశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

తన అభిమానులకు ఎన్నో విషయాలు తెలియవని, అందుచేతే వారికి అన్ని విషయాలను తెలియజేసేందుకు, అభిమానులతో అన్ని విషయాలను పంచుకునేదుకు జీవితకథ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నానని చెప్పారు. తన జీవిత కథ ద్వారా సచిన్ టెండుల్కర్ జీవితాన్ని అధారంగా చేసుకుని నిర్మితమవుతున్న చిత్రం 'సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్' ప్రచార కార్యక్రమంలో సచిన్ మాట్లాడారు. ఈ చిత్రం తనను కొత్తగా అవిష్కరిస్తుందని చెప్పారు. తన జీవితంలోని ఎన్నో మధురస్మృతులను తెరపై చూసుకోనుండటం మరింత ఉత్తేజితం చేస్తుందని సచిన్ చెప్పారు.

ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చిన తన చిత్రంలోని రెండవ పాటను సచిన్ ఆవిష్కరించారు. సచిన్ సచిన్ అంటూ మొదలయ్యే ఈ పాటకు సఖ్విందర్ గాత్రం అందించాడు. నిర్మాత రవి భాగ్‌చందక మాట్లాడుతూ.. సచిన్ ఇంట్లో వెయ్యి గంటల పాటు ఉన్న అరుదైన వీడియోల నుంచి  25 నిమిషాలపాటు అరుదైన సీన్లను తెరపై చూపిస్తామన్నారు. కేవలం తన ఇంట్లో మాత్రమే యాక్సెస్ అయ్యే కొన్ని వీడియోలను మూవీ యూనిట్ కు సచిన్ చూపించారు. వాంఖెడే స్డేడియంలో సచిన్ ఆటను మూవీలో చూడవచ్చన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles