జోరు మీదున్న టీమిండియా, నేపాల్ పై 99 పరుగుల విజయం Nepal lose to India by 99 runs in ACC Women's Asia Cup

Nepal lose to india by 99 runs in acc women s asia cup

cricket, india, nepal, indian women, nepal women, india vs nepal, poonam yadav. lowest total, asia cup t20, cricket news, sports news

The Indian women's cricket team didn't allow Nepal to put on a fight, bowling them out for a measly 21 runs in their pursuit of 121 runs.

జోరు మీదున్న టీమిండియా, నేపాల్ పై 99 పరుగుల విజయం

Posted: 12/02/2016 04:58 PM IST
Nepal lose to india by 99 runs in acc women s asia cup

టీమిండియా మహిళల క్రికెట్ జట్టు ప్రత్యర్థుల పంబరేపుతుంది. అంచనాలు ఏమీ లేకుండా ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీ బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు వరుసగా ఐదో విజయాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇవాళ జరిగిన చిట్టచివరి లీగ్ మ్యాచ్ లో నేపాల్ పై అద్బుత విజయాన్ని అందుకున్నారు. నేపాల్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 99 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నారు. నేపాల్ను 21 పరుగులకే కూల్చేసిన భారత్ సంచలన విజయం సొంతం చేసుకుంది. ఇప్పటికే వరుస నాలుగు విజయాలతో ఫైనల్ కు చేరిన భారత్.. అదే జోరును నేటి నేపాల్తో మ్యాచ్లో కూడా కొనసాగించింది.

నేపాల్ స్కోరు బోర్డులో ఎక్సట్రా పరుగులకు వచ్చిన ఏడు పరుగులకే ఆ జట్టు అత్యధిక స్కోరు అంటే మన వాళ్లు ఏ రకంగా చెలరేగిపోయారు  అర్ధం చేసుకోవచ్చు. ఆ తరువాత సరితా మాగర్(6)దే నేపాల్ జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. మొత్తం జట్టు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో నేపాల్ కు ఘోర ఓటమి తప్పలేదు. పూనమ్ పాండే మూడు వికెట్లు తీయగా, మేఘనా, అనుజా పటేల్లు తలో రెండు వికెట్లు సాధించారు. శిఖా పాండే, జోషి, ఏక్తా బిస్త్లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. వెల్లాస్వామి వనితా(21), అనుజ్ పటేల్(16), పార్వీన్(13), శిఖా పాండే(39 నాటౌట్),హర్మన్ ప్రీత్ కౌర్(14 నాటౌట్)లు భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో పాలు పంచుకున్నారు. కాగా లక్ష్యచేధనలో నేపాల్ జట్టు పూర్తిగా విఫలమైంది. మొత్తం జట్టులో ఆరు పరుగుల స్కోరు వ్యక్తిగత అదిక్యంగా నిలిచిందంటే నేపాల్ జట్టను టీమిండియా మహిళల జట్టు ఎలా మట్టికరింపించిందో అర్ధమైపోతుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian women  nepal women  asia cup  women cricket  cricket  

Other Articles