కుక్ పై వస్తున్న వదంతులు సత్య దూరం Joe Root backs ‘brilliant leader’ Alastair Cook

Joe root backs brilliant leader alastair cook

India vs England, alastair cook, captaincy, joe root, england, Team india, cook england, root england, alastair cook joe root, england cricket, rajkot test, first innings, virat kohli, virat kohli dismissal, Team india, fourth test, score update, r ashwin, wriddhiman saha, Adil Rashid, India vs England score

Joe Root’s backing comes in the wake of Alastair Cook’s recent comments that he could quit at the end of the ongoing five-match Test series against England.

కుక్ పై వస్తున్న వదంతులు సత్య దూరం

Posted: 12/02/2016 04:53 PM IST
Joe root backs brilliant leader alastair cook

టీమిండియాలో సుదీర్ఘ పర్యాటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు భారత్ లో అశించిన స్థాయిలో ప్రతిభను కనబర్చకపోవడంతో ఆ జట్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వేటు వేస్తుందని వస్తున్న ప్రచారాలకు జట్టులోని డాషింగ్  బ్యాట్స్ మెన్ జో రూట్ చెక్ పెట్టాడు. తమ జట్టు కెప్టెన్ కుక్ కు అండగా నిలిచాడు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని తాజాగా స్పష్టం చేశాడు. ఇంకా చాలాకాలం వరకూ కుక్ తమ సారథిగా ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇంగ్లండ్ జట్టులో కుక్కు ప్రత్యేక స్థానం ఉందనే విషయాన్ని గ్రహించాలని హితవు పలికాడు.

తమ జట్టు కెప్టెన్గా కొనసాగే అన్ని అర్హతలూ అతనొక్కడికే సొంతమని ప్రశంసల వర్షం కురిపించాడు. 'అతనొక అద్భుతమైన నాయకుడు. అతని సారథ్యంలో ఆడటాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తాను. మీరేమో కుక్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు నాకు ఇస్తాన్నారంటూ రూమర్లు పుట్టిస్తున్నారు. నన్ను బలవంతంగా మీరు కెప్టెన్ ను చేసినా, కుక్ కు వచ్చే ఇబ్బందేమీ లేదు. నాయకుడు అనే అదనపు భారం అతనిపై తగ్గి మరింత స్వేచ్ఛగా ఆడే వీలును కుక్కు కల్పించిన వారవుతారు' అని రూట్ చమత్కరించాడు.

తాను ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ కావడానికి చాలా సమయం ఉన్నదనే వాస్తవాన్ని గ్రహించాలన్నాడు. ప్రస్తుత తన బాధ్యతతో చాలా సంతృప్తిగా ఉన్నానని రూట్ తెలిపాడు. నిజాయితీగా చెప్పాలంటే తమకు సరైన నాయకుడు కుక్ అంటూ పొగడ్తలు కురిపించాడు. అనవసరంగా కుక్ ప్రతిభను తక్కువ చేసి చూపొద్దంటూ మీడియాకు సూచించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  alastair cook  captaincy  joe root  england  Team india  cricket  

Other Articles