ఐసీసీ నిర్ణయం తప్పు.. నేను అంగీకరించను I've done nothing wrong: Du Plessis

I ve done nothing wrong du plessis

Cricket, South Africa, International Cricket Council, ball tampering, guilty verdict, Proteas skipper, Faf du Plessis

Cricket South Africa has called on the International Cricket Council to review their rules regarding ball tampering following the guilty verdict handed down to Proteas skipper Faf du Plessis.

ఐసీసీ నిర్ణయం తప్పు.. నేను అంగీకరించను

Posted: 11/24/2016 06:35 PM IST
I ve done nothing wrong du plessis

తాను బాల్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ధారించడాన్ని దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డు ప్లెసిస్ తప్పుబట్టాడు. ఐసీసీ తనను ఈ విషయంలో దోషిగా నిర్థారించడం పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న తొందరపాటు చర్య అని అవేదన వ్యక్తం చేశాడు. తాను ఐసీసీ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించనని తేల్చచెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో తాను కావాలని ఏ తప్పు చేయలేదని మరోసారి పునరుద్ఘాటించాడు. ఈ మేరకు ఐసీసీ తనపై తీసుకున్న నిర్ణయం తప్పని తెగేసి చెప్పాడు.

బాల్ ట్యాంపరింగ్ అరోపణల్లో తాను తప్పు చేసినట్లు అభియోగించడం అర్థరహితమన్నాడు.బంతిలో మెరుపు తీసుకురావడానికి తాను ట్యాంపరింగ్ చేశానంటున్నారని అదే నిజమైతే.. తాను బంతిని గీకడం వంటి చర్యలకు పాల్పడాలని అన్నాడు. కృత్రిమమైన చర్యలతో బంతిపై మెరుపు రాదని ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్లు చాలా సార్లు చెప్పారని కూడా ఆయన వివరించారు. ఈ రకంగా చేస్తే బంతిపై మరింత మెరుపు వస్తుందని ఐసీసీ ఎక్కడా కూడా రికార్డుల్లో రాయలేదని. ఆ క్రమంలోనే ాను మోసానికి పాల్పడలేదని చెబుతున్నానని డు ప్లెసిస్ ధ్వజమెత్తాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles