విరాట్ ఫిట్ నెస్ కు కారణం ఆయనే The Man behind Virat Kohli To Take His Fitness Seriously

The man behind virat kohli to take his fitness seriously

India v England, india, england, Duncan Fletcher, Virat Kohli, India v England, Rajkot, Team India, England cricket, Gautam Gambhir, India, Joe Root, Murali Vijay, Rajkot, Ravichandran Ashwin, Sports, Virat Kohli, Umesh Yadav, India cricket

Many are aware of Virat Kohli one small chat with former India coach Duncan Fletcher that changed the way India's current Test skipper looks at fitness.

విరాట్ ఫిట్ నెస్ కు కారణం ఆయనే

Posted: 11/24/2016 06:06 PM IST
The man behind virat kohli to take his fitness seriously

అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో నెగ్గుకు రావడం అత్యంత కష్టతరమైన విషయం. కానీ దానిని అత్యంత సులభతరం చేసుకుని వస్తున్నాడు టీమిండియా టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇలా అన్ని ఫార్మెట్లలోనూ తాను రాణించేందుకు దోహద పడిన వ్యక్తి టీమిండియా మాజీ కోచ్ డంకెన్ ఫ్లెచర్ అని ఆయన తాజాగా పేర్కోన్నాడు. మూడు ఫార్మెట్లలో దూకుడుగా పరుగులు సాధించే శక్తి తనలో ఇమడటానికి ఆయన ఇచ్చిన సలహానే కారణమని చెప్పుకోచ్చాడు విరాటుడు.

ఫిట్నెస్ గా వుంటేనే రాణించగలమన్న సత్యాన్ని కోహ్లి ఎప్పుడో గ్రహించాడు. దానిలో భాగంగానే తన ఫిట్నెస్ను కాపాడుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తునే ఉన్నాడు. ప్రధానంగా 2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరువాత విరాట్ కోహ్లి ఫిట్నెస్ విషయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నాలుగేళ్ల క్రితం ఐపీఎల్ అనంతరం తన ఆహార నియమావళి విషయంలో కఠినమైన పద్ధతులు అవలంభిస్తున్నాడు. అది తన సక్సెస్కు కారణమని ఇదివరకే చెప్పిన కోహ్లి.. తనలో ఈ మార్పులకు కారణం డంకెన్ ఫ్లెచర్ అని చెప్పాడు.

తొలుత తన ప్రతిభను గుర్తించిన డంకెన్ ఆ తరువాత తన ఫిట్ నెస్పై కూడా కొన్ని సూచనలు చేశాడని కోహ్లి గుర్తు చేసుకున్నాడు. తనను మూడు ఫార్మాట్లలో అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు.. ఒక టెన్నిస్ ప్లేయర్ తరహాలో ట్రయన్ కావాలని.. దానిలో భాగంగా నీ రోజువారీ వ్యాయమం. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని కూడా సూచించాడని.. మనం ఫిట్గా ఉన్నప్పుడే మానసికంగా కూడా బలంగా ఉంటామనిని ఫ్లెచర్ తనకు హితబోధ చేసినట్లు కోహ్లి పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India v England  virat kohli  india  england  Duncan Fletcher  Team India  cricket  

Other Articles