కోహ్లీ మనోధైర్యాన్ని దెబ్బతీసే కుట్రే బాల్ ట్యాంపరింగ్ Allegations of ball tampering against Virat Kohli

Allegations of ball tampering against virat kohli twitterati reacted

virat kohli, kohli, kohli ball tampering, virat kohli ball tampering allegations, virat kohli ball tampering reactions, ball tampering reactions, cricket news, sports news

Test captain Virat Kohli was accused of ball tampering during the drawn first cricket Test against England at Rajkot by a British daily.

కోహ్లీ మనోధైర్యాన్ని దెబ్బతీసే కుట్రే బాల్ ట్యాంపరింగ్

Posted: 11/23/2016 08:23 PM IST
Allegations of ball tampering against virat kohli twitterati reacted

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మనోధైర్యాన్ని దెబ్బతీసేవిధంగా బ్రిటీష్ మీడియా కథనాలు ప్రచురించింది. ఐసిసీ నిబంధనలన్నీ తమకు తెలుసు అన్నట్లుగా వ్యవహరించే దినపత్రిక టీమిండియా చేతిలో మ్యాచ్ ఓడిపోయిన తరుణంలో కక్షపూరితంగా ఈ కథనాన్ని రాసీ విరాట్ కోహ్లీ మనోదైర్యాన్ని, అత్మవిశ్వాసాన్ని కుంగదీయాలని ప్రయత్నాలు చేసింది, విరాట్ కోహ్లీ బాల్‌ టాంపరింగ్‌ కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కథనాలను ప్రచురించింది.

రాజ్‌కోట్‌ టెస్టు సందర్భంగా విరాట్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ బ్రిటిష్‌ దిన పత్రిక ‘ది డెయిలీ మెయిల్‌’ కథనం ప్రచురించింది. తన నోట్లో ఉన్న తెల్లటి పదార్థాన్ని తీసి బంతికి అద్దుతూ దానికి మెరుపు తెచ్చేందుకు కోహ్లీ ప్రయత్నించాడని ఓ ఆధారాన్ని కూడా చూపింది. కోహ్లీ కుడి చేతిని నోట్లో పెట్టుకోవడం, దాంతో బంతిని రుద్దుతుండగా టీవీ కెమెరాలు బంధించాయని తెలిపింది. వైజాగ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోయిన తర్వాత బ్రిటన్‌ పత్రిక ఈ కథనం రాయడాన్ని చూస్తే అది కావాలనే విరాట్‌పై ఆరోపణలు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఐసీసీ నిబంధనలన్నీ అవసోసన పట్టినట్టుగా చెప్పుకునే అక్కడి దినపత్రికలు.. నిబంధనలకు తిలోదకాలిస్తూ ప్రచురించిన కథనం విరాట్ సేనలో పెరిగిన అత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికేనన్న విమర్శలకు కూడా వస్తున్నాయి, ఐసీసీ నిబంధనల ప్రకారం టెస్టు మ్యాచ్‌ ముగిసిన ఐదు రోజుల్లోపు ఆటగాడిపై బాల్‌ టాంపరింగ్‌ ఫిర్యాదు చేయాల్సి ఉండగా. విశాఖ టెస్టులో గెలుపోందిన తరువాత అరోపణలు గుప్పిస్తూ కథనాలు రాయడం సమంజసం అనిపించుకోదు. విశాఖ టెస్టులో విరాట్ సేన గెలుపు జీర్ణించుకోలేక బ్రిటన్‌ మీడియా కావాలనే చౌకబారు అరోపణలు చేస్తుందని అభిమానులు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  Team India  virat kohli  ball tampering  allegations  reactions  cricket  

Other Articles