పార్థివ్ పటేల్ ఈసారైనా సత్తా చాటేనా..? will parthiv patel utilizes test cricket oppurtunity..?

Will parthiv patel utilizes test cricket oppurtunity

parthiv patel, parthiv, wriddhiman saha, saha, saha injury, india vs england, ind vs eng, india england test, india england 3rd test, india england mohali, sports news, cricket news

Parthiv Patel has made a spectacular return to the Indian Test side after a gap of eight years. Patel’s selection has opened up a question whether the Indian team management is looking at the future or wants to give its ‘old’ stars another break

పార్థివ్ పటేల్ ఈసారైనా సత్తా చాటేనా..?

Posted: 11/23/2016 07:50 PM IST
Will parthiv patel utilizes test cricket oppurtunity

పార్థివ్ పటేల్.. క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు ఇది, అత్యంత పిన్న వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టి.. ప్రారంభంలో తన సత్తాను చాటిన కుర్రాడు పార్థివ్ పటేల్. 17 ఏళ్ల వయసులో 2002లో ఇంగ్లండ్‌ తో జరిగిన మ్యాచ్‌ తో టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. చిన్న వయసులోనే జాతీయ జట్టులో చోటు సంపాదించిన పార్థివ్‌ జట్టులో స్తానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. సచిన్ లాంటి దిగ్గజాలు అతనికి మద్దతుగా నిలిచినా.. రాణించడంలో తడబాటుకు గురయ్యాడు, అంచనాలకు తగినట్టు రాణించలేక స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు.

ఆ తరువాత వచ్చిన ధోని జట్టులో పాతుకుపోవడంతో పార్థివ్‌ కు అవకాశం లేకుండా పోయింది. ధోని జట్టుకు దూరమైనప్పుడు మాత్రమే అతడికి సెలెక్టర్ల నుంచి పిలుపువచ్చేంది. ఆరేళ్ల కాలంలో పటేల్‌ కేవలం 20 టెస్టు మ్యాచ్‌ లు మాత్రమే ఆడాడు. అయితే ఇప్పుడు ఆయన ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర పడింది. ఊహించని విధంగా అవకాశం తలుపు తట్టింది. సాహా గాయపడడంతో టీమిండియా టెస్టు టీమ్‌ లో పార్థివ్‌ కు ఛాన్స్‌ దక్కింది. పార్థివ్‌ చివరిసారిగా 2008 ఆగస్టులో శ్రీలంకతో కొలంబొలో జరిగిన టెస్టు మ్యాచ్‌ లో టీమిండియా తరపున ఆడాడు. ప్రస్తుతం రంజీల్లో రాణిస్తున్న పార్థివ్.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా..? లేదా అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parthiv patel  wriddhiman saha  india vs england  mohali  cricket  

Other Articles