ఇంగ్లాండ్ విజయలక్ష్యం 318 పరుగులు.. 8 వికెట్లు.. 90 ఓవర్లు India strike two late blows to gain edge over England

India strike two late blows to gain edge over england

India vs England, visakha test, second innings, virat kohli, cheteshwar pujara, ravichandran ashwin, ravindra jadeja, gautam gambhir,Team india, second test, day 1, score update, r ashwin, wriddhiman saha, Virat Kohli, Adil Rashid ,India vs England score

Chasing 405 runs for victory, England were reduced to 87/2 in their second innings as India struck late during the fourth day's play in the second cricket Test match

ఇంగ్లాండ్ విజయలక్ష్యం 318 పరుగులు.. 8 వికెట్లు.. 90 ఓవర్లు

Posted: 11/20/2016 05:26 PM IST
India strike two late blows to gain edge over england

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. భారత్ విసిరిన 405 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. ఓపెనర్లు హమిద్(25), అలెస్టర్ కుక్(54)లను మాత్రమే ఇంగ్లండ్ కోల్పోవడంతో మ్యాచ్ ఫలితం కోసం చివరి రోజు వరకూ వెళ్లింది. రెండో ఇన్నింగ్స్ లో గెలుపు కోసం శ్రమిస్తున్న ఇంగ్లాండ్.. అవకాశం కుదరని పక్షంలో మ్యాచ్ డ్రా కోసం యత్నిస్తున్న ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు పరమ జిడ్డు అటకు దిగారు, 38 ఓవర్లను అడిన ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ 50 పరుగులు చేయడమే ఇందుకు నిదర్శనంగా వుంది. ఈ మ్యాచ్ లో భారత్కు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా, పటిష్టమైన ఇంగ్లండ్ ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.

ఇంగ్లండ్ ఓపెనర్లు అలెస్టర్ కుక్, హమిద్లు అత్యంత నిలకడగా ఆడుతూ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీ సుదీర్ఘంగా క్రీజ్లో పోరాటం చేసింది. అయితే 144  బంతులను ఎదుర్కొన్న హమిద్ చివరకు అశ్విన్ బౌలింగ్ లో వికెట్లు ముందు దొరికిపోయాడు. దాంతో వీరి 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, 171 బంతులను ఎదుర్కొన్న కుక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఈ రోజు ఆటలో చివరి ఓవర్ లో కుక్ రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్ లో కుక్ ఎల్బీగా అవుటయ్యాడు.

ఆటలో మన బౌలర్లు 59.2 ఓవర్లు పాటు బౌలింగ్ చేసి కేవలం రెండు వికెట్లు సాధించడం ఇంగ్లండ్ పట్టుదలకు అద్దం పడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 50 ఓవర్లలో దాదాపు సగం ఇంగ్లండ్ జట్టును పెవిలియన్ కు పంపిన భారత్.. రెండో ఇన్నింగ్స్  లో మాత్రం వికెట్ల వేట కోసం తంటాలు పడుతోంది. ఇంకా సోమవారం చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. భారత్ విజయం సాధించాలంటే ఎనిమిది వికెట్లు అవసరం కాగా, అదే ఇంగ్లండ్ గెలుపు కోసం 318 పరుగులు చేయాల్సి ఉంది. ఈ టార్గెట్ ను సాధించేందుకు ఇంగ్లాండ్ చేతిలో ఎనమిది వికెట్లతో పాటు 90 ఓవర్లు మాత్రమే వున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  visakha test  second innings  Virat kohli  Team india  cricket  

Other Articles