ఇంగ్లాండ్ కెప్టెన్ గేమ్ ప్లాన్ లో చిక్కున్న కోహ్లీ Alastair Cook remains to be a trouble for India

Virat kohli trapped in the clutches of cook game plan

Alastair Cook, Game Plan, Virat Kohli, India v England, Rajkot, Team India, England cricket, Gautam Gambhir, India, Joe Root, Murali Vijay, Rajkot, Ravichandran Ashwin, Sports, Virat Kohli, Umesh Yadav, India cricket

If Alastair Cook carries in this fashion, he may enjoy another astonishing run against India, both as skipper and batsman.

ఇంగ్లాండ్ కెప్టెన్ గేమ్ ప్లాన్ లో చిక్కున్న కోహ్లీ

Posted: 11/15/2016 07:38 PM IST
Virat kohli trapped in the clutches of cook game plan

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో తాము టెస్టు మ్యాచ్ ను డ్రాగా ఎలా చేయాలన్న విషయాన్ని కూడ నేర్చుకున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో అసలు మ్యాచ్ లో ఏం జరిగింది..? ఆ విషయాన్ని కోహ్లీ బయటకు చెప్పకుండానే తాను పాఠాలు నేర్చుకున్నానని చెప్పడంలో అంతర్యమేమిటీ..? మ్యాచ్‌ ఆద్యంతం పర్యాటక జట్టు పైచేయి సాధించడంలో కుక్ గేమ్ ప్లాన్ ఎలా వర్క్ అవుట్ అయ్యిందన్న విషయాలను క్రీడా విశ్లేషకులు వివరిస్తున్నారు. విరాట్ కోహ్లీ సరిగ్గా 49పరుగుల వద్ద కోనసాగుతున్న తరుణంలో మ్యాచ్ అర్థంతరంగా డ్రాగా ముగిసింది.
 
ఇంగ్లాండ్ డిక్లెర్డ్ చేసిన తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 49 ఓవర్లలో 310 పరుగులు చేయాలి. కానీ భారత్ ఇంకా ఎక్కువ ఓవర్లే(52.3) ఆడిందని క్రీడా విశ్లేషకులు వివరించారు. భారత్ 49 ఓవర్లు ఆడాక కూడా అంపైర్లు మ్యాచ్ ముగియలేదు మరో 3 ఓవర్లు ఆడితే 90 ఓవర్లు అవుతాయని సూచించారు. దీంతో భారత్ బ్యాటింగ్ కొనసాగించింది. 90 ఓవర్లు ముగిసిన తరువాత ఆట ముగించే నిర్ణిత సమయానికి ఇంకో 10 నిమిషాల సమయం ఉన్నందున మరో రెండు ఓవర్లు అడించారని.. అయితే సరిగ్గా కోహ్లీ 49 పరుగుల వద్దకు చేరుకోగానే కుక్ డ్రా కోసం కోహ్లీని సంప్రదించడం అయన సరేనని చెప్పడంతో మ్యాచ్ డ్రాగా ముగిసిందని క్రీడా విశ్లేషకులు బావిస్తున్నారు.
 
భారత్ వికెట్లు కోల్పోతున్న సమయంలో కుక్ భారత బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడికి గురిచేయడానికి ఫ్యాడ్‌కు తగిలిన ప్రతి బాల్‌ను అప్పీల్ చేయడం, ఫీల్డర్లను దగ్గరగా పెట్టడం వంటివి అమలు చేశాడని వివరిచారు. అంతేకాదు సమయం మిగిలుందని అంపైర్లకు నివేదించాడని కూడా విరాట్ తెలుసుకోలేకపోయాడని అన్నారు. అంతేకాదు కోహ్లీ సరిగ్గా 49 పరుగుల వద్దకు చేరుకోగానే డ్రా చేద్దామని కోహ్లీని అడిగాడని కూడా క్రీడా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

అయితే దీని వెనుకనున్న రహస్యం ఏమిటంటే.. అంతా కుక్ గేమ్ ప్లాన్. ముక్కుసూటిగా వెళ్లి తత్వమున్న కోహ్లీ కుక్ గేమ్ ప్లాన్ లో చిక్కుకున్నాడు. కుక్ ఇలా ఎందుకు చేశాడంటే బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీ చేస్తే తర్వాత మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో ఉంటాడని. అదే సెంచరీకో, హాఫ్ సెంచరీకో దగ్గరగా వచ్చి ఆగిపోతే మానసికంగా కృంగిపోతాడని వారి భావనని క్రీడా విశ్లేషకులు బావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కుక్ అలా చేసుంటాడని తెలిపారు. కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ కంటే మ్యాచ్ ముఖ్యమని భావించే డ్రాకి అంగీకరించి ఉంటాడని భావించివుంటాడని వారి అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alastair Cook  Game Plan  Virat Kohli  India v England  Rajkot  Team India  England cricket  India cricket  

Other Articles