విశాఖ టెస్టుకు అందుబాటులోకి కెఎల్ రాహుల్ Rahul added to India squad for second Test vs England

Rahul added to india squad for second test vs england

kL rahul, vizag, indian squad, second test, bcci, visakhapatnam, Virat Kohli, India v England, Rajkot, Team India, England cricket, Gautam Gambhir, India, Joe Root, Murali Vijay, Rajkot, Ravichandran Ashwin, Sports, Virat Kohli, Umesh Yadav, India cricket

Promising batsman Lokesh Rahul was drafted into the India squad ahead of the second cricket Test against England, starting from November 17 at Vizag

విశాఖ టెస్టుకు అందుబాటులోకి కెఎల్ రాహుల్

Posted: 11/15/2016 08:59 PM IST
Rahul added to india squad for second test vs england

సుమారుగా రెండేళ్ల కాలం తరువాత అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో టీమిండియా ఓపెనర్ విఫలం చెందాడా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఈ కారణంగా మళ్లీ ఆయన పెవిలియన్ కు పరిమితం కానున్నాడా.? అంటే కూడా అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. న్యూజీలాండ్ తో రాణించిన గౌతమ్ గంభీర్.. ఇంగ్లాండ్ తో రాణించలేకపోయాడు. దీంతో ఆయన మళ్లీ పెవీలియన్ కే పరిమితం చేసే అవకాశాలు అధికంగా వున్నాయి.

తొలి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించిన ఇంగ్లండ్ జట్టును దీటుగా ఎదుర్కోవాలంటే, జట్టులో మార్పులు చేయడం అనివార్యం అని భావించిన కోహ్లీ విఫలమవుతున్న గంభీర్ స్థానంలో గాయపడి ఫిట్ నెస్ సంపాదించిన కేఎల్ రాహుల్ ను తీసుకోనున్నాడు. ఇటీవల గాయంతో దూరమైన రాహుల్ ఫిట్ నెస్ నిరూపించుకోవడంతో అతనికి లైన్ క్లియర్ అవుతోంది. తద్వారా మురళీ విజయ్, కేఎల్ రాహుల్, కోహ్లీ, పుజారా, రహానే, అశ్విన్, సాహాలతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా మారుతుందని, తద్వారా ఇంగ్లండ్ ను ఓడించవచ్చని కోహ్లీ భావిస్తున్నాడు. దీంతో విశాఖ టెస్టులో గంభీర్ స్థానంలో కేఎల్ రాహుల్ దిగనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India v England  kL rahul  vizag  indian squad  second test  bcci  visakhapatnam  Team India  cricket  

Other Articles