గంభీర్ పోయినా భారీ స్కోర్ దిశగా భారత్.. | India strong after Gambhir wicket in Rajkot

India steady after first loss of wicket

Rajkot test, England vs India Test, India Test Match, India vs England, England Rajkot Test

India steady after first loss of wicket against England in Rajkot test.

బిగ్ టార్గెట్ అయినా ఆడుతున్నారు

Posted: 11/11/2016 11:46 AM IST
India steady after first loss of wicket

స్టార్ బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీర్ మరోసారి నిరాశపరిచాడు. చాలా రోజుల తరువాత జట్టులో తిరిగి స్థానం సంపాదించుకున్న గౌటీ రాజ్ కోట్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ లో తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేరాడు. మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే బ్రాడ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు. 72 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో గంభీర్ 29 పరుగులు చేశాడు.

మరో ఎండ్ లోని మురళీ విజయ్ ఆడుతుండగా, ప్రస్తుతం అతనికి పుజారా వచ్చి కలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు 46 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 148 పరుగులు. నిన్న 311/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ 537 పరుగులు భారీ స్కోర్‌ వద్ద ఆలౌట్‌ అయ్యింది.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో తొలి రోజు రూట్ (124)సెంచరీ చేయగా రెండోరోజు ఆటలో ఎమ్ ఎమ్ అలీ (117), స్టోక్స్(128) సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్ల పడగొట్టగా, అశ్విన్, షమీ, యాదవ్ లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  England  rajkot test  

Other Articles