రాజ్కోట్ టెస్టులో విరాట్ ను వెంటాడిన దురదృష్టం Virat Kohli rare dismissal in Rajkot

Virat kohli s hit wicket dismissal in rajkot test a rare occasion

India vs England, rajkot test, first innings, virat kohli, hit wicket, virat kohli dismissal, virat kohli hit wicket, Team india, first test,day 4,score update,r ashwin,wriddhiman saha,Virat Kohli,hit wicket,Kohli hit wicket,Adil Rashid,India vs England score

India captain Virat Kohli had a bizarre dismissal against England in the first innings of the first Test in Rajkot as he stepped on the leg-stump after playing a shot.

రాజ్కోట్ టెస్టులో విరాట్ ను వెంటాడిన దురదృష్టం

Posted: 11/12/2016 06:41 PM IST
Virat kohli s hit wicket dismissal in rajkot test a rare occasion

పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడింది.  క్రీజ్లో కుదురుకున్నట్లు కనిపించిన కోహ్లి హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా నాల్గో రోజు ఆటలో ఇంగ్లండ్ స్పిన్నర్ రషీద్ వేసిన 119 ఓవర్లో మూడో బంతిని కోహ్లి మిడ్ వికెట్ మీదుగా ఆడాడు. అయితే అప్పటికే విరాట్ ఎడమ కాలు బెయిల్స్ను తాకడంతో అది కింద పడిపోయింది. కాగా, ఈ విషయాన్నిగమనించిన కోహ్లి సాధారణంగానే సింగిల్ కోసం క్రీజ్ను సగం దాటేసి వెళ్లిపోయాడు. ఇంగ్లండ్ శిబిరంలో సంతోషం చూసిన తరువాత కానీ విరాట్ కు తాను అవుటయ్యానన్న సంగతి తెలియలేదు.

ఇదిలా ఉండగా, ఈరోజు ఆటలో విరాట్ కు ముందు అజింక్యా రహానే బౌల్డ్ గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ జాఫర్ అన్సారీ బౌలింగ్ లో బంతిని మీదుగా లాక్కొని రహానే అవుటయ్యాడు. మరొకవైపు టెస్టుల్లో ఒక భారత ఆటగాడు ఇలా హిట్ వికెట్ గా వెనుదిరగడం 14 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. 2002లో వీవీఎస్ లక్ష్మణ్ ఆంటిగ్వాలో జరిగిన టెస్టులో ఇలా హిట్ వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉండగా, ఇలా అవుటైన భారత టెస్టు కెప్టెన్లలో విరాట్ రెండో వాడు. అంతకుముందు అమర్ నాథ్ ఒక్కడే హిట్ వికెట్ గా అవుటైన భారత కెప్టెన్ గా నిలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  rajkot test  first innings  virat kohli  hit wicket  Team india  cricket  

Other Articles