రెండో వన్డేలోనూ ‘కంగారె’త్తించిన దక్షిణాఫ్రికా Du Plessis century underpins crushing South Africa win

Du plessis century underpins crushing south africa win

faf du plessis, faf, du plessis, south africa, south africa cricket team, proteas, australia, australia cricket team, south africa vs australia, sa vs aus, australia vs south africa, cricket, cricket news, sports, sports news

Faf Du Plessis made 111 as South Africa piled up 361 after being sent in to bat. The win gives South Africa 2-0 lead in the series.

రెండో వన్డేలోనూ ‘కంగారె’త్తించిన దక్షిణాఫ్రికా

Posted: 10/02/2016 07:21 PM IST
Du plessis century underpins crushing south africa win

మళ్లీ తొలివన్డే మ్యాచ్ ఫలితమే రిపీట్ అయ్యింది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ సఫారీలు చెలరేగిపోగా, అసీస్ చతికిలపడ్డారు. ఇవాళ జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 142 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఇప్పటికే తొలి వన్డేను గెలిచిన సఫారీలు ఇవాళ జరిగిన రెండో వన్డేలోనూ విజయం సాధించడంతో  ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసింది. తొలి వన్డేలో క్విన్ డీ కాక్ సఫారీలపై చెలరేగగా, రెండో వన్డేలో డుప్లెసిస్ వీరభాదుడు భాధాడు,

‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఫాఫ్ డు ప్లెసిస్ (93 బంతుల్లో 111; 13 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... డుమిని (58 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), రోసో (81 బంతుల్లో 75; 10 ఫోర్లు) అండగా నిలిచారు. అనంతరం ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. హెడ్ (45 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వార్నర్ (56 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. పార్నెల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌పై పరుగులపరంగా సఫారీలకు ఇది రెండో అతి పెద్ద విజయం కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  south africa  johenesburg  second odi  faf du plessis  cricket  

Other Articles