ఈడెన్ టెస్టు: సెకెండ్ ఇన్నింగ్స్ లో రాణించిన రోహిత్ శర్మ Rohit Sharma puts India in command

Rohit sharma continues love affair with eden gardens

ind vs nzl second test, Eden Garden, new zealand, rohit sharma, virat kohli, wriddhiman saha, Team India, virat kiohli, anil kumble, cricket, cricket news, India, India vs New Zealand 2016, Martin Guptill, new zealand, sports news, sports

India, after a top-order collapse, finished Day 3 with a lead of 339 runs after Rohit Sharma's 82 against New Zealand on tricky Eden Gardens pitch.

ఈడెన్ టెస్టు: సెకెండ్ ఇన్నింగ్స్ లో రాణించిన రోహిత్ శర్మ

Posted: 10/02/2016 05:47 PM IST
Rohit sharma continues love affair with eden gardens

ఈడెన్ గార్డెన్ వేదికగా పర్యాటక జట్టు న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 339 పరుగుల అధిక్యత సాధించింది, మూడవ రోజు అట ముగిసే సమయానికి ఎనమిది వికెట్ల నష్టానికి 227 పరుగుల సాధించింది, దీంతో తోలి ఇన్నింగ్స్ లోని అధిక్యంతో కలసి భారత్  మొత్తంగా 339 పరుగుల అధిక్యంతో కొనసాగుతుంది. అదిలోనే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల కడలి ఈదుతున్న టీమిండియాను భారత సారధి విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి అదుకోగా, గత కొన్నాళ్లుగా టెస్టు క్రికెట్ లో రాణించలేకపోయినా రోహిత్ శర్మ అద్బుత ఇన్నింగ్స్ ఆడి (132 బంతుల్లో 82)తో రాణించడంతో భారత్ ఆధిక్యం 339 పరుగులకు చేరుకుంది.

తొలి ఇన్నింగ్స్ లో లాగానే భారత జట్టు త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ధావన్(17), విజయ్(7) మరోసారి విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో రాణించిన చతేశ్వర్ పుజారా(4), రహానే (1) త్వరగానే ఔటయ్యారు. దీంతో 43 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (65 బంతుల్లో 45) వేగంగా ఆడి జట్టును ఆదుకున్నాడు. 7వ వికెట్ కు రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా సెంచరీ (103) భాగస్వామ్యం నెలకొల్పారు. భారత జట్టు 106 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ 89 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు.

61వ ఓవర్లో శాంట్నర్ భారత్ కు షాకిచ్చాడు. ఆ ఓవర్ రెండో బంతికి రోహిత్ శర్మను ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా సిక్స్ కొట్టి, మరోసారి షాట్ ఆడే యత్నంలో నీషం క్యాచ్ పట్టడంతో ఎనిమిదో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. వాతావరణం అనుకూలించకపోవడంతో కాస్త ముందుగానే అంపైర్లు ఆట నిలిపివేశారు. మూడో రోజు ఆట నిలిపివేసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 63.2 ఓవర్లాడి 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ప్రస్తుతం వృద్ధిమాన్ సాహా(39 బ్యాటింగ్), అతడికి తోడుగా భువనేశ్వర్ కుమార్ (8 నాటౌట్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు మూడో రోజు ఆటలో మురళీ విజయ్(7), పూజారా(4), ధవన్(17), రహానే(1), కోహ్లి(45),అశ్విన్(5)లు పెవిలియన్ కు చేరారు. ఇప్పటివరకూ భారత్ కోల్పోయిన ఆరు వికెట్లలో హెన్రీ, సాంట్నార్ చెరో మూడు వికెట్లు సాధించగా, బౌల్ట్ కు రెండు వికెట్లు లభించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles