Sri Lanka vs Australia, 2nd Test Day 2: Australia are 25/2 at stumps

Australia suffer triple blow in chase

sri lanka vs australia, sl vs aus, sri lanka australia, sri lanka vs australia, sri lanka vs australia score, sl vs aus score, cricket score, score cricket, australia cricket team, sri lanka vs australia cricket streaming, cricket streaming video, cricket news, cricket

Australia end day's play at 25/3 and still require 388 runs to win, historic hat-trick by veteran spinner Rangana Herath, who became the second Sri Lankan to achieve the feat.

రెండో టెస్టులోనూ పైచేయి దిశగా లంకేయులు

Posted: 08/05/2016 06:59 PM IST
Australia suffer triple blow in chase

శ్రీలంక పర్యటనలో అధిత్యజట్టుతో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. రెండో టెస్టు మ్యాచ్లో కూడా అదే తరహా ఆట తీరును ప్రదర్శిస్తోంది. గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో లంకేయులు సాధించిన 281 పరుగలను అందుకునే క్రమంలో కేవలం ఆసీస్ 106 పరుగులకే కుప్పకూలింది. గాలే టెస్టులో విజయాన్ని అందుకుంటామని విశ్వాసం వ్యక్తం చేసిన అసీస్ లంక స్పీన్ ముందు మోకరిల్లక తప్పలేదు. వారి విజయ ధీమా కాస్త.. అవిరవుతున్నట్లు కనబడుతుంది.
 
54/2 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 52 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్ను శ్రీలంక స్పిన్నర్లు రంగనా హెరాత్, దిలుర్ వాన్ పెరీరాలు కుప్పకూల్చారు. వీరిద్దరూ తలో నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. కాగా, హెరాత్ హ్యాట్రిక్ వికెట్లతో ఆకట్టుకున్నాడు.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో భాగంగా 25.0 ఓవర్లలో వోజస్, నేవిల్,స్టార్క్లను వరుస బంతుల్లో పెవిలియన్ కు పంపిన హెరాత్ హ్యాట్రిక్ నమోదు చేశాడు.
 
ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్(42), మిచెల్ మార్ష్(27)లు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన లంకేయులు 237 పరుగుల వద్ద అలౌట్ అయ్యారు. లంక బ్యాట్స్‌మెన్‌లో డిల్‌రువాన్ పెరెరా 64, మాథ్యూస్ 47, కుశాల్ పెరెరా 35, డిసిల్వ 34, హెరాత్ 26 పరుగులు చేశారు.అయితే 413 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను శ్రీలంక ఆదిలోనే పెద్ద దెబ్బ కొట్టింది.

5 ఓవర్లలో 10 పరుగులకే 3 వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన డిల్‌రువాన్ పెరారా నాథన్ లియన్, కవాజాలను డకౌట్ చేశాడు. తర్వాత జోయ్ బర్న్స్‌ను రెండు పరుగుల వద్ద హెరాత్ పెవీలియన్‌కు పంపాడు. దీంతో కెప్టెన్ స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసిస్ గెలవడం అసాధ్యం. దీంతో ఇప్పటికే మొదటి టెస్ట్ గెలిచిన శ్రీలంక రెండో టెస్ట్‌ను కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
 
స్కోరు :
శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్ : 281/10
ఆసిస్ ఫస్ట్ ఇన్నింగ్స్ : 106/10
శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ : 237/10
ఆసిస్ సెకండ్ ఇన్నింగ్స్ : 25/3 (6 ఓవర్లలో,  రోండో రోజు ఆట ముగిసింది.)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rangana herath  sri lanka  australia  sri lanka vs australia 2016  cricket  

Other Articles