Jerome Taylor announces retirement from Test cricket

Jerome taylor retires from test cricket

Jerome Taylor retires from tests, Jerome Taylor bid to test cricket, England, Barbados, West Indies, Test cricket, West Indies Cricket Board, Sydney, Kingston, Jerome Taylor, India

West Indies fast bowler Jerome Taylor has retired from Test cricket, according to the West Indies Cricket Board.

సెలక్టర్లపై విసుగెత్తి టెస్టులకు టైలర్ వీడ్కొలు

Posted: 07/12/2016 04:13 PM IST
Jerome taylor retires from test cricket

వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జెరోమ్ టేలర్ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నెలలో భారత్ తో జరగనున్న టెస్టు క్రికెట్ పై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన అయన.. సెలక్టర్ల పద్దతిపై విసుగెత్తి.. విమర్శలు సంధిస్తూ టెస్టు క్రికెట్ కు విడ్కోలు పలికాడు. కెరీర్లో 46 టెస్టు మ్యాచులాడిన టేలర్ 130 వికెట్లు పడగొట్టాడు. 18 ఏళ్ల వయసులో 2003 ఏడాది శ్రీలంకతో సిరీస్ లో ఆరంగేట్రం చేసిన టేలర్ 13 ఏళ్లుగా విండీస్ జట్టు తరుఫున టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. వన్డేలు, టీ20 ఫార్మాట్లో బౌలర్ టేలర్ కొనసాగుతాడు.

ఈ ఏడాది ఆరంభంలో సిడ్నీలో చివరి టెస్ట్ ఆడిన టేలర్ ను భారత్తో సిరీస్ కు బోర్డు పక్కన పెట్టింది. దీంతో తాను ఈ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు బోర్డుకు తెలిపాడు. గాయాల కారణంగా ఎక్కువగా సతమతమయ్యాడు. 2009లో 11 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు కేవలం 51 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో జట్టుకు విజయాన్ని అందించాడు. అదే ఏడాది ఆ సిరీస్ తర్వాత 2009-2014ల మధ్య ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.

మళ్లీ జట‍్టులోకి వచ్చాక ఆస్ట్రేలియాపై 6/47తో రాణించి జట్టులో చోటు ఖాయం చేసుకుని 17 టెస్టుల్లో ప్రధాన బౌలర్ గా జట్టుకు సేవలందించాడు. 2008లో న్యూజీలాండ్ పై 10వ నంబర్ ఆటగాడిగా క్రీజులోకొచ్చిన టేలర్ ఏకంగా సెంచరీ (106) సాధించి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. వన్డేలు, టీ20లలో కొనసాగాలని, మరోవైపు గాయాల వేధిస్తున్నాయని భావించిన ఈ బౌలర్ టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : West Indies  Jerome Taylor  retirement  Test cricket  WICB  

Other Articles