Anil Kumble brings discipline to Indian team – late for team bus, pay $50

Anil kumble threatens team india latecomers with usd 50 fine

anil kumble, kumble, india new coach,Indian team head coach, discipline, Team india, Indian cricketers, who is new india cricket coach, india cricket coach, india cricket team, bcci cricket, cricket india, cricke news, cricket India

This is one of the rules Kumble has enforced since taking charge as India’s head coach.

అనిల్ కుంబ్లే మార్కు క్రమశిక్షణ.. లేటుపై ఫైన్..

Posted: 07/13/2016 06:05 PM IST
Anil kumble threatens team india latecomers with usd 50 fine

టీమిండియా కొత్త కోచ్ అనిల్ కుంబ్లే గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏ పని చేసినా వెరైటీగా ఉంటుంది. అందుకే టీమిండియాకు ఆటగాళ్లకు తనదైన మార్క్‌‌లో కండిషన్ షురూ చేశాడు. నిబంధనలు పాటించకపోతే ఫైన్ వేస్తామని హెచ్చరించాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో రెండు రోజుల వార్నప్ మ్యాచ్ ఆడటానికి ముందు 'కోడ్ ఆఫ్ కాండక్ట్' నిబంధనలను విధించాడు. ఆలస్యంగా వస్తే 50డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.

బస చేసిన హోటల్ నుంచి టీమ్ బస్ వద్దకు నిర్ణీత సమయంలోపు రావాలని భారత క్రికెటర్లకు సూచించాడు. ఎవరైనా ఆలస్యంగా బస్సు వద్దకు వస్తే 3 వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇక విండీస్ పర్యటనలో ప్రతి నాలుగో రోజు ఆటగాళ్లతో అధికారికంగా సమావేశం కావాలని నిర్ణయించాడు. ఆటగాళ్లకు ఏ సమస్యలున్నా, సందేహాలున్నా ఏ సమయంలోనైనా తనతో కలసి మాట్లాడవచ్చని చెప్పాడు.

విండీస్ పర్యటనలో మంచి ఫలితాలు రాబట్టాలని భావిస్తున్న కుంబ్లే.. చీఫ్‌ కోచ్గా కొన్ని నిబంధనలు పెట్టాడు. ఆటగాళ్లకు క్రమశిక్షణ ప్రాధాన్యం గురించి తెలపడంతో పాటు అవసరమైన స్వేచ్ఛ ఇవ్వాలని కుంబ్లే భావిస్తున్నట్టు జట్టు వర్గాలు తెలిపాయి. ఆటగాళ్లకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ, వారిలో ఉత్సాహం నింపేందుకు కుంబ్లే ప్రయత్నిస్తున్నాడు. ఆటగాళ్లకు ట్రైనింగ్ సెషన్, ప్రాక్టీస్తో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ప్రణాళిక తయారుచేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Kumble  Indian team head coach  discipline  Team india  Indian cricketers  

Other Articles