Shastri living in fool's world, says angry Sourav Ganguly

Ganguly hits back at shastri on coach controversy

Sourav Ganguly, Ravi Shastri, Ganguly-Shastri, Indian coach, Sachin tendulkar, VVS Laxman, India's head coach, BCCI, cricket, cricket news

Despite being one of the top contenders for the role, Shastri lost the job to Anil Kumble, who is said to have made a detailed presentation before CAC comprising Ganguly, Sachin Tendulkar and VVS Laxman.

ఆయన పిచ్చోళ్ల ప్రపంచంలో విహరిస్తున్నారు..

Posted: 06/30/2016 12:02 PM IST
Ganguly hits back at shastri on coach controversy

టీమిండియా మాజీ కెప్టెన్లు రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. టీమిండియా కోచ్ పదవి దక్కకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన రవిశాస్త్రీ.. తనపై చేసిన వ్యాఖ్యలపై 'దాదా' ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రవిశాస్త్రి పిచ్చోళ్ల ప్రపంచంలో బతుకుతున్నాడని తీవ్రంగా విరుచుకుపడ్డాడు. తాను టీమించియా కోచ్ కాకుండా గంగూలీ అడ్డుపడ్డాడని రవిశాస్త్రి ఆరోపించిన నేపథ్యంలో గంగూలీ ఘాటుగా స్పందించాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలు తనకుకు ఆశ్చర్యం, బాధ కలింగించాయన్నారు

భారత జట్టుకు క్రికెట్ కోచ్ బాధ్యతలంటే సామాన్యం కాదు. అలాంటి పదవికి ఇంటర్వ్యూ అంటే బ్యాంకాక్ నుంచి హాజరు కావడమేంటి? కమిటీలో ఉన్నది నేను ఒక్కడినేనా. ఇండియన్ క్రికెట్ లో గొప్ప వాళ్లున్న కమిటీ. సమకాలీకుడైన దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే మా ముందు రెండు గంటల పాటు కూర్చుని మాట్లాడాడు. ఇప్పుడు మేం నిర్వహించిన బాధ్యతలను పదేళ్ల క్రితమే చేపట్టి, మాకు మార్గదర్శకంగా నిలవాల్సిన వ్యక్తి పరిణతి లేకుండా విమర్శించడం ఏంటి? బీసీసీఐ కమిటీల్లో 20 ఏళ్లుగా ఉంటున్న వ్యక్తి వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు"

‘ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే కోచ్ ఎంపికకు ఇంటర్వ్యూలు జరిగిన రోజున బెంగాల్ క్రికెట్ సంఘం(క్యాబ్) సమావేశానికి హాజరయ్యాను. నా వల్లే టీమిండియా ప్రధాన కోచ్ పదవి దక్కలేదని రవి అనుకుంటే.. అతడు పిచ్చోళ్ల ప్రపంచంలో ఉన్నట్టే. నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తాడని అనుకోలేదు. ఇది చాలా బాధాకరమ'ని గంగూలీ వ్యాఖ్యానించాడు. విమర్శలు చేసే ముందు వెనకాముందు ఆలోచించాలని రవిశాస్త్రికి హితవు పలికాడు.

అయితే గంగూలీ వ్యాఖ్యలపై టీమిండియా క్రికెట్ అభిమానులు పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రవిశాస్త్రీ చేస్తున్న విమర్శల వెనుక అర్థమేమిటీ..? అంతరార్థమేమిటీ అన్న కోణంలో కొందరు మాత్రమే అలోచిస్తున్న సమయంలో గంగూలీ వ్యాఖ్యల నేపథ్యంలో మరికోందరు అ దిశగా అలోచించాల్సిన అవసరం ఏర్పడింది. అటు వయస్సులోనూ, ఇటు అటలోనూ తన కన్నా సీనియర్ అయిన రవిశాస్త్రీపై గంగూలీ ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. పదవిలో వున్నాం కదా అని సీనియర్లను విమర్శించడం సమంజసం కాదని హితవు పలుకుతున్నారు. మరి దాదా ఇకనైనా వెనక్కు తగ్గుతారో లేదో వేచి చూడాలి మరి..!

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sourav Ganguly  Ravi Shastri  India's head coach  BCCI  cricket  

Other Articles