It's not about me or Ravi Shastri, it's about players says Anil Kumble

There is absolutely no conflict of interest says india s coach anil kumble

anil kumble, kumble, anil kumble india coach, coach anil kumble, coach kumble, india cricket, india cricket coach, kumble shastri, anil kumble ravi shastri, cricket

the newly-appointed Indian coach Anil Kumble said it's the players who are the most significant part of the system and no one else.

క్రికెట్ కోచ్ ఎవరన్నది ముఖ్యం కాదు.. ఆటగాళ్లే కీలకం..

Posted: 06/29/2016 07:53 PM IST
There is absolutely no conflict of interest says india s coach anil kumble

టీమిండియాలో ఆటగాళ్ల కన్నా అధిక ప్రాధాన్యం, ప్రాముఖ్యత మరెవరికీ లేదని, వాళ్లే ముఖ్యం, వాళ్ల మెరుగైన ప్రతిభను కనబర్చడమే కీలకమని టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రీ తాను ఇంటర్వ్యూ సమయంలో సౌరవ్ గంగూలీ లేడని, తనతో ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని గత కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తూనే వున్న నేపథ్యంలో వాటన్నింటినీ తోసిపుచ్చుతూ కుంబ్లే తనదైన శైలిలో తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. కోచ్ ఎవరన్నది ముఖ్యం కాదని, జట్టు సభ్యులు ప్రతిభ కనబర్చి విజయం సాధిస్తున్నారా.? లేదా అన్నదే ముఖ్యమని చెప్పారు.

అనుభవం, యువ ఆటగాళ్ల మేలికలయికతో భారత క్రికెట్ జట్టు సమతూకంగా ఉందని అభిప్రాయపడిన కుంబ్లే.. ఇలాంటి జట్టుకు ప్రధాన కోచ్ గా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నాడు. కోచ్ గురించి మాట్లాడాల్సిన పనిలేదని.. ఆటగాళ్లు, జట్టు గురించే ఆలోచించాలని పేర్కొన్నాడు. 'కోచ్ నేనా, రవిశాస్త్రా అన్నది పక్కనపెట్టండి. టీమిండియా బాగా ఆడాలని అందరూ కోరుకోవాలి. భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదో గొప్ప అవకాశం. ఏడాది పాటే నన్ను కోచ్ గా నియమించినందుకు బాధ లేదని అన్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానని కుంబ్లే చెప్పాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Kumble  Team India Head coach  ravi shastri  sourav ganguly  BCCI  Cricket  

Other Articles