Riki Wessels-Michael Lumb break Sourav Ganguly-Rahul Dravid’s record

Ganguly dravid batting record broken by england pair

riki wessels, michael lumb, sourav ganguly, rahul dravid, ganguly dravid, dravid ganguly, sports, county records, english county records, cricket news, cricket, Sourav Ganguly-Rahul Dravid record, record one day partnership, England pair, Riki Wessels and Michael Lumb, Nottinghamshire

The Nottinghamshire stand of 342 runs beat the previous record in England of 318 by Sourav Ganguly and Rahul Dravid.

గంగూలీ, ద్రావిడ్ ల స్కోరును బ్రేక్..

Posted: 06/07/2016 07:48 PM IST
Ganguly dravid batting record broken by england pair

టీమిండియా మాజీ దిగ్గజాలు సౌరవ్  గంగూలీ, రాహుల్ ద్రావిడ్లు వన్డే క్రికెట్లో నెలకొల్పిన 318 పరుగుల భాగస్వామ్యం రికార్డును ఇంగ్లండ్ కుర్రాళ్లు బ్రేక్ చేశారు. రాయల్ లండన్ వన్డే కప్లో భాగంగా నార్తాంప్టన్షైర్తో మ్యాచ్లో నాటంగ్హామ్షైర్ ఓపెనింగ్ జోడీ రికీ వెస్సెల్స్, మైకేల్ లంబ్ 342 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 39.2 ఓవర్లలో ఈ పరుగులు సాధించారు. సెంచరీ వీరులు రికీ వెస్సెల్స్ (146), మైకేల్ లంబ్ (184) కెరీర్ బెస్ట్ నమోదు చేశారు. 1999 వన్డే ప్రపంచ కప్లో శ్రీలంకతో టాంటన్ (ఇంగ్లండ్)తో జరిగిన మ్యాచ్లో భారత్ తరపున గంగూలీ, ద్రావిడ్ 318 పరుగుల భాగస్వామ్యం చేశారు.

ఓవరాల్గా వన్డే క్రికెట్లో మూడో అత్యుత్తమ భాగస్వామ్యంకాగా, ఇంగ్లండ్ గడ్డపై ఇదే అత్యధికం. తాజాగా నాటంగ్హామ్షైర్ ఓపెనర్లు జోడీ ఈ రికార్డును బ్రేక్ చేసి.. అత్యధిక వన్డే పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఇంగ్లీష్ జోడీగా ఘనత సాధించింది. ఇక ఈ మ్యాచ్లో మరో రికార్డు కూడా బ్రేక్ అయ్యింది. లిస్ ఏ మ్యాచ్లో ఇరు జట్లు కలసి అత్యధిక రికార్డు పరుగులు చేశాయి. ఇరు జట్లు కలసి 870 పరుగులు చేశాయి. నాటంగ్హామ్షైర్ 445 పరుగులు చేయగా, నార్తాంప్టన్షైర్ 425 పరుగులకు ఆలౌటైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles