Virat Kohli in the middle of a dream run: Muttiah Muralitharan

Muttiah muralitharan in awe of unstoppable virat kohli

Virat Kohli, Muttiah Muralitharan, ICC World T20, Cricket Association of Bengal, IPL 2016

The legendary Sri Lankan off-spinner is attending Cricket Association of Bengal's 'Vision 2020' programme. The offie was all praise for the in-form Virat Kohli.

కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తిన లంక దిగ్గజం

Posted: 06/07/2016 08:31 PM IST
Muttiah muralitharan in awe of unstoppable virat kohli

ఇటీవల జరిగిన ఐపీఎల్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరికలేకుండా గడిపాడు. ఐపీఎల్లోనే రికార్డు స్థాయిలో నాలుగు సెంచరీలు చేయడంతో పాటు అత్యధికంగా 973 పరుగులు సాధించాడు. ఆయన అద్భుత ఆటను ఎంతో మంది క్రికెట‌ర్లు గొప్ప‌గా పొగిడేస్తోన్నారు. ఇప్పుడు ఆ లిస్టులో శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ కూడా చేరారు. కోల్‌క‌తాలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) నిర్వ‌హించిన‌ ఓ కార్యక్రమానికి హాజరైన మురళీధరన్ మాట్లాడుతూ.. కోహ్లీ బ్యాటింగ్‌ని క‌ట్ట‌డి చేయ‌డం ఏ బౌలర్ వ‌ల్లా కాద‌ని అన్నారు.

మున్ముందు కూడా చాలాకాలం వ‌ర‌కు కోహ్లీ ఇదే ర‌క‌మైన ఆట‌తీరుతో అభిమానుల‌ను అల‌రించే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అన్ని ఫార్మాట్ల‌లోనూ కోహ్లీ త‌న‌దైన శైలిలో రాణిస్తున్నాడ‌ని, ఆయ‌న‌ను నియంత్రించడం క‌ష్ట‌మైన ప‌నేన‌ని ముర‌ళీధ‌ర‌న్ అన్నారు. విరాట్ కోహ్లీ భ‌విష్య‌త్తులో చాలా కాలం ఇదే ఆట‌తీరును క‌న‌బ‌ర్చి రికార్డుల మోత మోగించాల‌ని ఆయ‌న ఆశించారు. కోహ్లీ ప్ర‌పంచ మేటి ఆట‌గాడ‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. ఇదిలావుండగా, ఐపీఎల్ ముగియడంతో విరాట్కు విశ్రాంతి లభించింది. జింబాబ్వే టూరుకు విరాట్ను ఎంపిక చేయకుండా సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.

ఇక వెస్టిండీస్కు టూరుకు ఇంకా నెల విరామం ఉంది. దీంతో కోహ్లీ క్రికెట్కు దూరంగా ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. విదేశాలకు షూటింగ్కు వెళ్లిన గర్ల్ఫ్రెండ్ అనుష్క శర్మను విమానాశ్రయనికి తీసుకెళ్లి సెండాఫ్ ఇచ్చాడు. మధ్యలో తన ఫౌండేషన్ తరపున ఈవెంట్లలో పాల్గొంటూ డాన్స్లతో అదరగొట్టాడు. ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో ఓ పాట కూడా పాడాడు. కోహ్లీ అసలు క్రికెట్ గురించే ఆలోచించడం లేదు. ఈ విషయాన్ని విరాటే చెప్పాడు. కొన్ని రోజుల పాటు క్రికెట్ దూరంగా వుండాలని కూడా నిర్ణయించుకున్నాడు కోహ్లీ.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles