Cricketer Critical After Suffering Brain Haemorrhage in a T20 Game

Cricketer critical after suffering brain haemorrhage in a t20 game

Bolton, brain haemorrhage, cricket, Hashim Akhtar, Lancashire, IPL 2016, cricket news, pakistan teen cricketer, T20 match, England, salford royal hospital, royal bolton hospital

Cricketer Hashim Akhtar in hospital aftr suffering brain hemorrhage at T20 match in Bolton,found collapsed in toilet

పాక్ సంతతి టీన్ క్రికెటర్ కుప్పకూలిపోయాడు.. పరిస్థితి విషమం..

Posted: 06/01/2016 07:26 PM IST
Cricketer critical after suffering brain haemorrhage in a t20 game

పాకిస్థాన్‌ సంతతికి చెందిన హషీమ్‌ అఖ్తర్ అనే ఓ టీనేజి క్రికెటర్ ఇంగ్లండ్‌లో టి 20 క్రికెట్ మ్యాచ్ ఆట మధ్యలో కుప్పకూలిపోయాడు. అతడికి బ్రెయిన్ హెమరేజ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆట కొనసాగుతుండగా మధ్యలో అఖ్తర్ కనిపించకపోవడంతో జట్టు సభ్యులు అతడి కోసం వెతకగా, టాయిలెట్‌లో కుప్పకూలి కనిపించాడు. అతడి మెదడులో రక్తం గడ్డకట్టడంతో దాన్ని తొలగించడానికి అత్యవసరంగా ఓ ఆపరేషన్ చేశారు. అయినా ఇంకా అతడి పరిస్థితి విషమంగానే ఉందని రాయల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతడిని వైద్యులు బలవంతంగా కోమాలోకి పంపి చికిత్స అందిస్తున్నారు.

ఆస్ట్లీ బ్రిడ్జ్ సీసీ జట్టు తరఫున అతడు బ్రాడ్‌షా సీసీ జట్టుపై క్రికెట్ ఆడుతున్నాడు. తమ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్రేక్ అనంతరం అందరూ కలిసి గ్రౌండ్ లోకి వెళ్దామనుకుంటే అతడు కనిపించలేదని జట్టు సభ్యులు తెలిపారు. తీరా చూస్తే టాయిలెట్‌లో పడిపోయాడని, అదృష్టవశాత్తు అవతలి జట్టు సభ్యులలో ఒకరి తండ్రి వైద్యుడు కావడంతో వెంటనే అతడిని చూసి, ఆస్పత్రికి తరలించాలని చెప్పారని అన్నారు. గతంలో అఖ్తర్‌కు మైగ్రేన్ ఉండేది. 13 ఏళ్ల వయసు నుంచి ఆస్ట్టీ బ్రిడ్జ్ జట్టు తరఫున అతడు ఆల్‌రౌండర్‌గా ఆడుతున్నాడు. అతడిని అప్పుడే కోమాలోంచి బయటకు తేలేమని వైద్యులు చెప్పారని అఖ్తర్ తల్లి చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bolton  brain haemorrhage  cricket  Hashim Akhtar  Lancashire  T20 match  cricket  

Other Articles