Shahadat Hossain's suspension from domestic cricket lifted

Bangladesh allow shahadat hossain to play only domestic cricket

shahadat hossain, shahadat hossain bangladesh, hossain bangladesh, bcb, shahadat hossain alleged, shahadat hossain criminal case, sports news, sports, cricket news, cricket

Shahadat Hossain was banned from all forms of cricket last year by BCB after he became a subject of investigation for alleged criminal offence

వివాదస్పద క్రికెటర్ కు తాత్కాలి ఉపశమనం

Posted: 05/11/2016 05:21 PM IST
Bangladesh allow shahadat hossain to play only domestic cricket

క్రికెటర్ షాదత్ హుస్సేన్ పై విధించిన నిషేధాన్ని బంగ్లాదేశ్ ఎత్తివేసింది. స్వదేశంలో మ్యాచ్ లు ఆడేందుకు అతడిని అనుమతించింది. క్రిమినల్ కేసు ఎదుర్కొన్న హుస్సేన్ పై గతేడాది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) నిషేధం విధించింది. తన ఇంట్లో పనిచేసే 11 ఏళ్ల బాలికను అతడు వేధించినట్టు ఆరోపణలు రావడంతో దుమారం రేగింది. ఈ వివాదం మీడియాలో హైలెట్ కావడంతో హుస్సేన్ తో పాటు అతడి భార్య న్రిట్టో షాదత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అతడిపై బీసీబీ చర్య తీసుకుంది.

తాను తప్పు చేయలేదని బుకాయించిన హుస్సేన్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పాడు. తాను తప్పు చేశానని, మన్నించాలని ఏప్రిల్ 28న బీసీబీని వేడుకున్నాడు. ఈ కేసులో నేరం రుజువయితే హుస్సేన్, అతడి భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే హుస్సేన్ తో బాధిత బాలిక కుటుంబంతో రాజీకి వచ్చిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బాలిక కుటుంబానికి హుస్సేన్ డబ్బు ముట్టజెప్పి, తనపై ఆరోపణలను ఉపసంహరించుకునేలా ఒప్పించాడని తెలిపాయి.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladesh cricketer  Shahadat Hossain  BCB  pakistan cricket  

Other Articles