Mohsin Hassan Khan | Shahryar Khan | Mickey Arthur | south africa | PCB | pakistan cricket

Mohsin questions pcbs decision to appoint arthur

Pakistan Cricket Board, PCB chairman Shahryar Khan, Mickey Arthur, Mohsin Hassan Khan, pcb head coach, match-fixing allegations, Pakistan, South Africa, Mickey Arthurs match-fixing dead issue, cricket news, cricket

Former coach Mohsin Hassan Khan questioned the Pakistan Cricket Board's decision to appoint South African Mickey Arthur as the head coach

తన వినతిని ఎందుకు పీసీబి విస్మరించింది

Posted: 05/10/2016 06:21 PM IST
Mohsin questions pcbs decision to appoint arthur

మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన అభియోగాలను ఎదుర్కోంటున్న దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్ను పాకిస్తాన్ క్రికెట్ కోచ్ గా నియమించాల్సిన  అవసరమేమిటని ఆ దేశ మాజీ కోచ్ మొహిసిన్ హసన్ ఖాన్ ప్రశ్నించాడు. తాను కోచ్గా చేస్తానంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు విన్నవించినా పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు పీసీబీ ఆంతర్యమేమిటో అర్థం కాకుండా ఉందన్నాడు. పీసీబీ చైర్మన్గా ఉన్న షహర్యార్ ఖాన్, అందులో ఉండే సభ్యులు ఏమి వండాలనుకుంటున్నారో తనకైతే తెలియదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

'నేను మరోసారి కోచ్ పదవిని కోరుతూ పీసీబీకి దరఖాస్తు చేశా. పాక్ క్రికెట్ స్వరూపాన్ని మార్చేస్తానని ఛాలెంజ్ చేసి చెప్పా. కొంతమంది కింది స్థాయి ఆటగాళ్లను నాకు అప్పగించి ఫలితం చూడమని వారికి నివేదించా. అయినా వారు నన్ను పట్టించుకోలేదు. నన్ను విస్మరించి.. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడ్నితెచ్చుకున్నారు'అని మొహిసిన్ ఖాన్ విమర్శించాడు. పాకిస్తాన్ క్రికెట్ కోచ్ గానైనా, మెంటర్గానైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని పీసీబీతో చెప్పినా వారు పట్టించుకోలేకపోవడానికి కారణమేమిటని మొహిసిన్ ఖాన్ నిలదీశాడు.

తాను ఎప్పుడూ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తన స్వలాభాల కోసం పాక్ కోచ్ పదవిని అభ్యర్థించలేదన్న విషయాన్ని తమ దేశ బోర్డు గ్రహిస్తే మంచిదన్నాడు. తన సామర్థ్యం పట్ల పీసీబీ మాజీ చైర్మన్ ఇజాజ్ భట్ నుంచి ఎన్నోసార్లు అభినందనలు అందుకున్నానని మొహిసన్ ఖాన్ పేర్కొన్నాడు. వైఫల్యాల బాట నుంచి తన దేశ జట్టును విజయతీరాలకు చేర్చేందుకే తాను కోచ్ పదవిని అడిగానని చెప్పాడు. కాగా, గతంలో పాకిస్తాన్ తాత్కాలిక కోచ్గా మొహిసిన్ ఖాన్ పనిచేసిన సంగతి తెలిసిందే.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohsin Hassan Khan  Shahryar Khan  Mickey Arthur  south africa  PCB  pakistan cricket  

Other Articles