5 pakistan cricket players ask artists to dance; get into a brawl

Umar akmal in the middle of yet another controversy

Umar Akmal, stage drama, Five pakistan players, Pakistan Cricket Board, brawl in faisalabad, cricketers brawl in faisalabad, National One-day Cup matches, cricketers disorderly conduct,

Five players who have represented the country are apparently under investigation by Pakistan Cricket Board on suspicion of their involvement in a brawl and disorderly conduct in Faisalabad where they played National One-day Cup matches.

మరో వివాదంలోకి అక్మల్.. విచారణకు అదేశించిన పీసీబి

Posted: 04/26/2016 07:03 PM IST
Umar akmal in the middle of yet another controversy

వరల్డ్ టీ 20లో పేలవమైన ప్రదర్శనతో ఇంటా బయట విమర్శలను ఎదుర్కోంటున్న పాకిస్థాన్ క్రికెటర్లు మరో వివాదానికి కారణమయ్యారు. పాక్ స్టార్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్తో పాటూ మరో నలుగురు జాతీయ స్థాయి క్రికెటర్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. వీరందరకీ ఫైసలాబాద్ కు చెందిన ఓ థియేటర్లో చోటుచేసుకున్న ఘర్షణలో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ అదేశాలను ఖాతరు చేయని థియేటర్ సభ్యులపై దాడులకు పాల్పడ్డారన్న అరోఫణలపై పిసీబి విచారణకు అదేశించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఫైసలాబాద్ లోని ఓ థియేటర్ లో ఆదివారం రాత్రి జరిగిన డ్రామా షోకు అక్మల్, మరో నలుగురు క్రికెటర్లు హాజరయ్యారు. అయితే డ్రామాలో ఓ యువతి చేసిన నృత్యాన్ని మరోసారి చేయాలంటూ వీరు డిమాండ్ చేశారు. దీనికి థియేటర్ యాజమాన్యం నిరాకరించింది. దీంతో తమ అదేశాలనే కాదంటారా..? అంటూ క్రికెటర్లు ధియేటర్ నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. ఈసంఘటన జరిగిన సమయంలో అక్మల్తో పాటూ క్రికెటర్లు అవాసిస్ జియా, బిల్ వాల్ బట్టి, మహ్మద్ నవాజ్, షాహిద్ యుసుఫ్లు ఉన్నారు.

దీనికి సంబంధించిన వీడియో పాక్ టీవీ చానళ్లలో చక్కర్లు కొట్టడంతో అక్మల్ వివరణ ఇచ్చుకున్నాడు. తన వ్యక్తిగత జీవితం వేరు.. తన క్రికెటర్ జీవితం వేరని అన్నాడు. మరి అలాంటప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డడు ఆయనపై విచారణకు అదేశించడంలో అంతర్యమేమిటో అక్మల్ కే తెలియాలి. పైపెచ్చు అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి రాద్దాంతం చేస్తున్నారని కూడా మండిపడ్డారు. అంతేకాదు పాకిస్థాన్ మీడియా వ్యవహర శైలిపై కూడా మండిపడ్డాడు.

వినోదం కోసం మాత్రమే ఆ థియేటర్లో డ్రామా చూడటానికి వెళ్లానని... అదేం తప్పు కాద కదా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. క్రికెటర్ వ్యక్తిగత జీవితాన్ని హైలెట్ చేసి చూడకూడదని సూచించాడు. ఇంతవరకు బాగానే వున్న సమాజంలో క్రికెటర్ గా ఆయనకున్న గౌరవమర్యాదాలే అతనికున్న ఆస్తి అని తెలుసుకోకపోవడం అక్మల్ తప్పు. ఆయన క్రికెటర్ గా కాకుండా సాధారణ వ్యక్తిగా థియేటర్ లోనికి వెళ్తే.. ఆయన మరోమారు పాట పాడాలని ఎలా ధియేటర్ సభ్యులను డిమాండ్ చేస్తారని.. ఒక వేళ చేసివుంటూ ఆయన పరిస్థితి ఏమై వుండేదన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

క్రికెటర్లు వ్యక్తిగత జీవితంలోనూ హుందాగా వుండాలని, అప్పుడే వారిపై నున్న గౌరవం పెరుగుతుందని అభిమానులు కూడా సూచిస్తున్నారు. అయినా తాను జాతీయ జట్టుకు ఆడుతన్న క్రికెటర్ అని వారికి గుర్తుంటే ఇలాంటి చర్యలకు వారు దిగరని, తాము క్రికెటర్లం అని తెలిసి అహంభావంతో పెత్తనం చేయాలనుకున్నప్పుడే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దగా అవుతాయని అభిమానులు పేర్కొంటున్నారు. అయితే ఇంతకు ముందుకూడా ఉమర్ అక్మల్ రెడ్ సిగ్నల్ పడినా.. దాటుకుని పోవడమే కాకుండా.. ట్రాఫిక్ పోలీసులతో వాదనకు దిగి, వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Umar Akmal  brawl  pakistan  pcb  faisalabad  drama  dance  

Other Articles