SC upholds HC order on shifting IPL matches out of Maharashtra

Sc dismisses plea against bombay hc order on ipl matches

Supreme court, Bombay High court, IPL matches, Maharashtra, drought, maharastra drought, maratwada drought, IPL 2016, IPL 9, BCCI,

Supreme Court has rejected plea of Mumbai Cricket Association and Maharashtra Cricket Association against Bombay HC order to shift IPL matches out of the drought-hit state.

బాంబే హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం.. ఐపీఎల్ కు నో ఛాన్స్..

Posted: 04/27/2016 04:20 PM IST
Sc dismisses plea against bombay hc order on ipl matches

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులోనూ ఐపీఎల్ నిర్వాహకులకు, ముంబై, మహారాష్ట్ర క్రికెట్ సంఘాలకు చుక్కెదురైంది. మహారాష్ట్రలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో మహారాష్ట్ర, ముంబాయి, పూణేలలో ఎలాంటి క్రికెట్ మ్యాచ్ లను అడకూడదని, ముఖ్యంగా మే 1 తరువాత జరిగే అన్ని ఐపీఎల్ మ్యాచ్ లను ఇతర ప్రాంతాలకు తరలించాలని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్ధించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించడంతో పాటు వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలని సుప్రీంకోర్టు అదేశించింది.

మహారాష్ట్ర నుంచి నాగ్ పూర్, ఫూణే, వాంఖేడ్ స్టేడియంలలో ఎలాంటి మ్యాచ్ లను నిర్వహించరాదని బాంబే హైకోర్టు ఇటీవల దాఖలైన ప్రజాప్రయోజనవాజ్యాన్ని విచారించిన నేపథ్యంలో అదేశాలు జారీచేసింది, మహారాష్ట్రలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను ఏప్రిల్ 30 తరువాత నిర్వహించరాదని పేర్కోంది. ఈ లోపు ఇక్కడ జరగాల్సిన ఐపీఎల్ మ్యాచులను ఇతర ప్రాంతాలకు తరలించాలని బాంబే హైకోర్టు తీర్పును వెలువరించింది, ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో మహారాష్ట్రలో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు అడేందుకు చాన్స్ లేకుండా పోయింది.

మహారాష్ట్రలో కరువు, నీటి కొరత కారణంగా ఆ రాష్ట్రం నుంచి ఐపీఎల్ మ్యాచ్లను తరలించాలని బాంబే హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30 లోపు జరిగే ఆరు మ్యాచ్లు మాత్రమే ఆ రాష్ట్రంలో నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఆ తర్వాత జరగాల్సిన మరో 13 మ్యాచ్లను ఇతర రాష్ట్రాలకు తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలో ముంబైతో పాటు పుణె, నాగ్పూర్ వేదికల్లో మ్యాచ్లు జరగాల్సివుంది. కాగా బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర క్రికెట్ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అక్కడా వాటికి నిరాశ ఎదురైంది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme court  Bombay High court  IPL matches  Maharashtra  drought  IPL 2016  

Other Articles