World T20: Virat Kohli taking nothing for granted in virtual quarter-final

Virat kohli praises brilliant ms dhoni for match winning run out

World T20, India, Australia, cricket, virat kohli, ms dhoni, team india, bangladesh, bengaluru, world t20 2016, bangalore, mohali

MS Dhoni came in for high praise from team-mate and star batsman Virat Kohli for the way he ran Bangaldesh batsman Mustafizur Rahman out and secured a thrilling 1-run victory.

సామర్థ్యం మేరకు అడితే.. అసీస్ పై పైచేయి సాధిస్తాం

Posted: 03/27/2016 02:08 PM IST
Virat kohli praises brilliant ms dhoni for match winning run out

తమ సామర్థ్యం మేరకు ఆడితే ఆస్ట్రేలియాపై విజయం సాధిస్తామని టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. టి-20 ప్రపంచ కప్లో భాగంగా ఆసీస్తో జరగననున్న కీలక మ్యాచ్లో తాము విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. అసిస్ తో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్ కు  ముందు రోజు కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. ఆసీస్ బలమైన జట్టని, కంగారూలు ఎంతో దూకుడుగా ఆడుతారని, అదే తరహాలో తాము ఆడుతామనే నమ్మకముందని, సవాల్ను ఎదుర్కోవడాన్ని ఇష్టపడతానని చెప్పాడు.

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడని, అతనిలో గొప్ప గుణం అదేనని అన్నాడు. టి-20 ఫార్మాట్లో నిలకడగా రాణించడం చాలా కష్టమని చెప్పాడు. ఈ ఫార్మాట్లో పూర్తిగా దృష్టిపెట్టి ఆడటం చాలా అవసరమని అన్నాడు. మైదానంలో అడుగుపెట్టేటపుడు తాను ఒత్తిడికి గురికాకుండా, ఓ అవకాశంగా భావిస్తానని చెప్పాడు. ప్రత్యర్థి జట్టును చూసి భయపడకుండా, సవాల్గా తీసుకోవాలని సూచించాడు. ప్రపంచ కప్లో సెమీస్, ఫైనల్ మ్యాచ్లను గెలిస్తే మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కోహ్లీ అన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : World T20  Australia  Virat Kohli  india  

Other Articles