World T20 Bangladesh fined for slow over-rate against India

Icc fine bangladesh for slow over rate against india in world t20

India vs Bangladesh, ICC, World T20, Mashrafe Mortaza, Eden Gardens, chinnaswamy stadium, bengaluru, Mashrafe Bin Mortaza, slow over-rate

ICC has slapped a fine on Bangladesh skipper Mashrafe Bin Mortaza and his men for a slow over-rate against India

బంగ్లాదేశ్ కు జరిమానా విధించిన ఐసీసీ

Posted: 03/26/2016 05:25 PM IST
Icc fine bangladesh for slow over rate against india in world t20

టి-20 ప్రపంచ కప్లో భాగంగా చివరిదైన లీగ్ మ్యాచ్ లో టీమిండియాతో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం ముంగిట ఓడిపోయిన బంగ్లాదేశ్ జట్టుకు మరో పరాభం కూడా ముటగట్టుకోవాల్సి వచ్చింది.  ఈ మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మీకు అర్థమైపోయివుంటుంది. కదూ.. స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసినందుకు బంగ్లా కెప్టెన్ మోర్తజాకు మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఇతర ఆటగాళ్లకు 10 శాతం చొప్పున జరిమానా విధించారు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గత బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణీత సమయానికి బంగ్లా బౌలర్లు ఓ ఓవర్ తక్కువ వేశారు. దీంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ బంగ్లా జట్టుకు జరిమానా వేశారు. చిరస్మరణీయమైన ఈ మ్యాచ్లో ఓడిపోతుందని భావించిన టీమిండియా పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి మూడు బంతుల్లో బంగ్లా విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. పరుగు కూడా చేయకుండా వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : World T20  Bangladesh  fine  slow over rate  India  icc  

Other Articles