Indian cricket team celebrated Holi after Bangladesh win

Snorkelling in the flight with my mates twittes harbhaja

indian cricket team, indian cricket team holi, india holi photos, india holi, indian cricket team photos, cricket photos, Snorkelling, harbhajansingh, rohith sharma, india, bangladesh, icc t20 world cup-2016

Dhoni with a slightest bit of colour on his beard playing holi with teamates, is ready for the next challenge in Australia on Sunday.

ఈత కొడుతూ చండీగర్ చేరిన టీమిండియా క్రికెటర్లు

Posted: 03/25/2016 06:12 PM IST
Snorkelling in the flight with my mates twittes harbhaja

విమానంలో భారత క్రికెటర్లు ఈత కొట్టారు. అలా ఈత కోడుతూనే అదివారం అస్ట్రేలియాతో జరగనున్న వేదిక చండీగడ్ కు చేరుకున్నారు. అదేంటి వారు విమానంలో కదా వెళ్లేది. ఈత కొట్టడం ఏంటి.. అది కూడా క్రికెటర్లు అంటున్నారు, అనుకుంటున్నారా ? నిజమేనండి.. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి ఒక్క పరుగుతో విజయం సాధించిన భారత ఆటగాళ్లు ఫుల్ జోష్ మీద ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి గట్టెక్కిన టీం ఇండియా ఆటగాళ్లు ఆ ఆనందాన్ని హోలీ రూపంలో జరుపుకొని..ఇప్పుడు విమానంలో కూడా ఈత కొట్టారు. అది కూడా నీటిలో ఆక్సిజన్ అందించే స్నోర్కెలింగ్ అనే పరికరాన్ని ధరించి.

హర్బజన్ సింగ్, రోహిత్ శర్మ, రహానేలు స్నోర్కెలింగ్ పరికరాన్ని ధరించి విమానంలో ఈత కొడతున్నట్టు ఉన్న వీడియోను హర్భజన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. చాలా ఎంజాయి చేస్తున్నట్టు పేర్కొన్నాడు. అయితే యువరాజ్ సింగ్‌ మాత్రం తమతో జాయిన్ అవ్వడానికి సాహసించలేదంటూ హర్భజన్ ట్విట్  లో పేర్కొన్నాడు. ఓ లేటెస్ట్ యాప్ ను వాడి తాము విమానంలో ఈత కొడుతున్నట్లు కనిపించేలా బ్యాగ్రౌండ్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. విశేషాలను ఓ వీడియో తీసి ఈ క్రికెటర్స్ బంగ్లాపై మ్యాచ్ విజయాన్ని ఆస్వాదించారు!

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Snorkelling  harbhajansingh  rohith sharma  india  bangladesh  icc t20 world cup-2016  

Other Articles