‘Improvement will be our priority’: MS Dhoni urges India to lift run rate against Bangladesh

India needs to improve the run rate besides winning says ms dhoni

icc world t20, icc world t20 scores, world t20 news, world t20 scores, India, Australia, bangladesh, team india, T20 world cup, India vs Pakistan, T20 world cup, India vs Pakistan, pakistan, Indian cricket team, T20 world cup, sports news, sports, cricket

India skipper Mahendra Singh Dhoni urged his big-hitters to improve their run rate dramatically against Bangladesh on Wednesday or face the prospect of a humiliating early exit from the World Twenty20 on home soil.

అభిమానుల అంచనాలను అందుకుందాం..

Posted: 03/22/2016 09:03 PM IST
India needs to improve the run rate besides winning says ms dhoni

వరల్డ్ టీ 20కు ముందు వరుస విజయాలు అసియా కప్ టైటిల్ సాధించి హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగినా అందుకు తగిన ఆట తీరును కనబరచకపోవడం టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ లో ప్రారంభ మ్యాచ్ లోనే న్యూజీలాండ్ చేతిలో ఓటమి కావడం, ఆ తరువాత రన్ రేట్ లో మిగతా జట్లతో సరిసమానంగా కోనసాగడంతో.. ఇకనైనా జట్టు సమష్టిగా పోరాడి విజయాలను సాధించాల్సిన అవసరం ఉందని తన సహచరులకు ధోని హితవు పలికాడు.

ఎంతో అభమానిస్తున్న అభిమానుల అంచనాలను అందుకుందామని చెప్పాడు ఇంకా ఎమన్నాడంటే తన మాటల్లోనే..'ఈ టోర్నీకి ముందు ఫేవరెట్ జట్టుగా బరిలో దిగాం. పొట్టి ఫార్మాట్లో రెండోసారి టైటిల్ను గెలవాలంటే ఇకనైనా మెరుగైన ఆటను కనబరచాలి. ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టు గ్రూప్ లో ఉన్నందున అంచనాలకు తగ్గట్టు ఆడాల్సిన అవసరం ఉంది. విజయాలతో పాటు రన్ రేట్ను కాపాడుకోవాలి. సూపర్ -10 దశలో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండంతో ఆటగాళ్లు ఇకనైన మేల్కొంటారని భావిస్తున్నా.

న్యూజిలాండ్ తో జరిగిన తొలి గేమ్లో ఘోరంగా ఓటమి పాలు కావడంతో నెట్ రన్ రేట్ కూడా పడిపోయింది. మ్యాచ్లను గెలవడమే కాదు.. కొన్ని సమయాల్లో రన్ రేట్ కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. అందుచేత టీమిండియా జట్టు సభ్యులు రన్ రేట్ పై కూడా దృష్టి పెట్టండి' అని ధోని సూచించాడు. తాము ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్ లు తమకు చాలా కీలకమైనందును గెలుపుకోసం పోరాడతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Australia  bangladesh  team india  T20 world cup  India vs Pakistan  

Other Articles