Dhoni my Favourite But Virat Kohli Mr Popular in Team, Says Pakistan Women's Captain

Virat kohli most popular among pakistan women cricketers

icc world t20, icc womens world t20, icc world t20 2016, world t20, t20 womens world cup, womens icc world t20, pakistan, pakistan news, pakistan cricket, pakistan womens cricket team, sana mir, virat kohli, dhoni, msd, ms dhoni, cricket news, cricket

Mahendra Singh Dhoni, Virat Kohli and not any Pakistani cricketers are idolised by the country's women's cricket team, according to captain Sana Mir. She will relinquish captaincy after the World

ధోనికి నేను ఫ్యాన్.. కానీ విరాట్ చాలా పాపులర్..

Posted: 03/14/2016 05:52 PM IST
Virat kohli most popular among pakistan women cricketers

టీమిండియా ఆటగాళ్లంటే ప్రపంచవ్యాప్తంగా భలే క్రేజందని మనకు తెలుసు. అందులోనూ ముఖ్యంగా టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ దోని, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే ఆ క్రేజుకు కొలమానం కూడా లేదు. అయితే ఇదంతా ప్రపంచవ్యాప్తంగానే కానీ దాయాధి పాకిస్తాన్ లో మాత్రం కాదనుకుంటే పోరబాటే. ఎందుకంటరా..? పాకిస్తాన్ మహిళా క్రికెటర్లకు అత్యంత పాపులర్ క్రికెటర్ ఎవరో తెలుసా?  టీమిండియా యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ.! పాక్ మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ సనా మీర్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది.

కాగా ఆమెకు మాత్రం టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫేవరెట్ క్రికెటరట. ఓ ఇంటర్వ్యూలో సనా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 'మా జట్టులో మహిళా క్రికెటర్లకు విరాట్ కోహ్లీ పాపులర్ క్రికెటర్. నాకు మాత్రం ధోనీ ఫేవరెట్ క్రికెటర్.  ఎందుకంటే అతను భారత కెప్టెన్ కాబట్టి. మైదానంలో, బయటా ధోనీ ప్రవర్తన హుందాగా ఉంటుంది. జూనియర్లతో కూడిన జట్టును బలమైన టీమ్గా మార్చాడు' అని సనా చెప్పింది. పాకిస్తాన్ మహిళ క్రికెట్లో చాలా మార్పులు వస్తున్నాయని, క్రికెట్ కెరీర్గా ఎంచుకోవాలని చాలా మంది అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  MS Dhoni  Sana Mir  World T20  2016  Cricket latest World T20  2016 news  

Other Articles