Virat Kohli is a very dangerous player says Yusuf Pathan

Kohli a very dangerous player it is a treat to watch him play says yusuf pathan

Virat Kohli, Yusuf Pathan, India, World T20 2016, News, t20 world cup 2016, cricket, india, favourite team, india hot favourite says yusuf pathan,

he former Indian batsman has said that hopes will be pinned on the 27-year old should India have a remote chance of victory

ఇండియా హాట్ ఫేవరెట్.. విరాట్ మోస్ట్ డేంజరస్..

Posted: 03/14/2016 06:10 PM IST
Kohli a very dangerous player it is a treat to watch him play says yusuf pathan

రేపటి నుంచి ప్రారంభం కానున్న టీ2 వరల్డ్ కప్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ అని, ఖచ్చితంగా ధోని సేన అంచానాలకు మించి రాణిస్తుందని భారత క్రికెటర్ యూసఫ్ పఠాన్ అభిప్రాయపడ్డా‌డు. అందుకు ముఖ్యకారణం యంగ్ టర్క్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దూకుడు మీద ఉండటం.. ధోనీ సేన మీద చాలా ఆశలు రేపుతోందని అంటున్నాడు  మరోసారి పొట్టికప్పును ధోనీ సేన కైవసం చేసుకొని చరిత్ర తిరగరాస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.   2007లో టీ-20 వరల్డ్ కప్‌ గెలిచిన టీమిండియాలోఈ ఆల్‌రౌండర్‌ కూడా సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా ధోనీ సేన ఫామ్‌, యువత, అనుభజ్ఞులతో జట్టు మంచి సమతుల్యంతో ఉందని, దీనికితోడు స్వదేశంలో వరల్డ్ కప్ ఆడుతుండటం టీమిండియాకు కలిసొచ్చే విషయమని యూసఫ్ పఠాన్ విశ్లేషించాడు. ఇటీవల ఆస్ట్రేలియా, శ్రీలంక సిరీస్‌లలో, ఆసియా కప్‌లో భారత్‌ అద్భుతమైన ఆటతీరు కనబర్చిందని కొనియాడాడు. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో నిస్సందేహంగా ఇండియానే ఫేవరెట్ జట్టు అని, ఈ మెగా టోర్నమెంటులో డాషింగ్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ భారత జట్టుకు స్టార్ ఫర్ఫార్మెర్లుగా నిలువనున్నారని పేర్కొన్నాడు.

'టీ20 ఫార్మెట్‌లో కోహ్లి చాలా ప్రమాదకరమైన క్రికెటర్‌. అతని ఆటతీరు చూడటం నిజంగా కనులకు పండుగే. రోహిత్‌, కోహ్లి ఇద్దరు ప్రమాదకరమైన ఆటగాళ్లే. తమదైన శైలిలో ఆడుతూ.. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించగలరు' అని పఠాన్ పేర్కొన్నాడు. 33 ఏళ్ల యూసఫ్‌ పఠాన్‌ ప్రస్తుతం జట్టులో లేకపోవడం నిరాశ కలిగిస్తున్నదని చెప్పాడు. భవిష్యత్తులో జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Yusuf Pathan  India  World T20 2016  News  

Other Articles