Chris Gayle hit fifty in 12 balls

Chris gayle hit fifty in 12 balls

Chris Gayle, Yuvaraj Singh, BBL, melborne, Chris Gayle fifty in 12 Balls

The West Indian cricketer Chris Gayle is back in news, this time due to a good reason though, after equaling Yuvraj Singh's record for the fastest T20I fifty. The Jamaican played the whirlwind knock on Monday in the Big Bash League (BBL).

క్రిస్ గేల్ వీరవిహారం.. 12 బాల్స్ లో హాఫ్ సెంచరీ

Posted: 01/18/2016 06:27 PM IST
Chris gayle hit fifty in 12 balls

క్రికెట్ లో డెవిల్ లాగా రెచ్చిపోయే క్రిస్ గేల్ మరోసారి తన బ్యాటింగ్ విధ్వంసాన్ని చూపించారు. క్రీజ్ లో దిగిన క్రిస్ గేల్ బౌలర్ వేసిన ప్రతి బాల్ ను బౌండరీ దాటించేశాడు. అలా కేవలం 12 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో టీమిండియా బ్యాట్స్ మాన్ యువరాజ్ సింగ్ పేరుమీదున్న రికార్డును సమం చేశాడు. ఆడిలైడ్ స్ట్రైకర్స్ తో మెల్ బోర్న్ రునిగేడ్స్ తో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ టీ20 మ్యాచ్ లో క్రిస్ గేల్ తన విశ్వరూపాన్ని చూపించాడు. 12 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసి అందరికి క్రికెట్ మజాను పంచాడు.

తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆడిలైడ్ టీం 170 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన మెల్ బోర్న్ టీం ఓపెనర్ క్రిస్ గేల్ ఫస్ట్ ఓవర్లోనే నాలుగు సిక్సులు కొట్టడంతో 27 పరుగులు వచ్చాయి. క్రిస్ గేల్ అలా ఏడు సిక్సర్లు, ఒక ఫోర్ తో 12 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 17 బాల్స్ ాడిన గేల్ 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మ్యాచ్ లో క్రిస్ గేల్ మినహా ఎవరూ కూడా ఆడలేకపోవడంతో మెల్ బోర్న్ టీం కేవలం 143 పరుగులకే ఆలౌట్ అయింది.

1వ బాల్ - 2
2వ బాల్ - 0
.3వ బాల్ - 6
4వ బాల్ - 6
5వ బాల్ - 6
6వ బాల్ - 6
7వ బాల్ - 2
8వ బాల్ - 6
9వ బాల్ - 6
10వ బాల్ - 4
11వ బాల్- 1
12వ బాల్ - 6

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chris Gayle  Yuvaraj Singh  BBL  melborne  Chris Gayle fifty in 12 Balls  

Other Articles